https://oktelugu.com/

టాలీవుడ్ లో మరో పెద్ద స్టూడియో.. అల్లు అరవింద్ సంచలనం

నేడు(అక్టోబర్ 1) దివంగత సినీనటుడు అల్లు రామలింగయ్య జయంతి. గురువారం అల్లు రామలింగయ్య 99వ జయంతిని కుటుంబ సభ్యులు నిర్వహించారు. అల్లు రామలింగయ్య 1030 సినిమాల్లో నటించారు. ఆయన ఎక్కువగా హస్యనటుడిగా ప్రేక్షకులను అలరించారు. క్యారెక్టర్ ఏదైనా సరే ఆయన ఆ పాత్రలో జీవిస్తారు.. టాలీవుడ్ చరిత్రలో గొప్పగా నిలిచిపోయిన ఎన్నో చిత్రాల్లో ఆయన నటించి రాణించి ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. Also Read: పవన్ కళ్యాణ్ షూటింగ్ షెడ్యూల్ ఫిక్స్ ! అల్లు రామయ్య […]

Written By:
  • NARESH
  • , Updated On : October 1, 2020 / 06:49 PM IST
    Follow us on

    నేడు(అక్టోబర్ 1) దివంగత సినీనటుడు అల్లు రామలింగయ్య జయంతి. గురువారం అల్లు రామలింగయ్య 99వ జయంతిని కుటుంబ సభ్యులు నిర్వహించారు. అల్లు రామలింగయ్య 1030 సినిమాల్లో నటించారు. ఆయన ఎక్కువగా హస్యనటుడిగా ప్రేక్షకులను అలరించారు. క్యారెక్టర్ ఏదైనా సరే ఆయన ఆ పాత్రలో జీవిస్తారు.. టాలీవుడ్ చరిత్రలో గొప్పగా నిలిచిపోయిన ఎన్నో చిత్రాల్లో ఆయన నటించి రాణించి ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు.

    Also Read: పవన్ కళ్యాణ్ షూటింగ్ షెడ్యూల్ ఫిక్స్ !

    అల్లు రామయ్య సినీ నటుడిగానే కాకుండా ఆయుర్వేద వైద్యుడిగా సేవలందించారు. హస్యనటుడిగానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుగా.. విలన్ గా రాణించారు. అంతేకాకుండా గీతా ఆర్ట్స్ బ్యానర్ స్థాపించి ఎన్నో సినిమాలను నిర్మించారు. అల్లు రామలింగయ్య అగ్రహీరోలందరికీ సినిమాల్లో నటించారు. రాంగోపాల్ వర్మ-అల్లు రామలింగయ్య కాంబినేషన్లో వచ్చే కామెడీ నేటికి ప్రేక్షకుల్లో నవ్వులు పూయిస్తూ ఉంటోంది. ఆయన ఢిపెరెంట్ మ్యాజరిజంతో కామెడీ పండించేవారు.

    అల్లు రామలింగయ్య సేవలను గుర్తించిన ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ అవార్డు ఇచ్చింది. ఆయన మరణం తర్వాత అల్లు రామలింగయ్య పేరిట అల్లు ఫ్యామిలీ ప్రతీయేటా జాతీయ అవార్డులను అందిస్తోంది. నేడు అల్లు రామలింగయ్య 99వ జయంతి సందర్భంగా అల్లు కుటుంబం ఓ కీలక ప్రకటన చేసింది. ‘అల్లు స్టూడియోస్’ పేరిట ఓ భారీ స్టూడియో నిర్మించబోతున్నట్లు తెలిపారు.

    Also Read: గల్లీబాయ్స్ తో శ్రీముఖి రచ్చ !

    గండిపేటకు సమీపంలో సినిమా, టీవీ షూటింగులు జరుపుకునేలా ఓ భారీ స్టూడియో నిర్మించనున్నారు. అల్లు రామలింగయ్య పుట్టిన రోజును పురస్కరించుకొని గురువారం ఈ స్టూడియో నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇందుకు సంబంధించిన పనులన్నీ త్వరలోనే ప్రారంభించనున్నట్లు అల్లు అర్జున్ తన సోషల్ మీడియాలో వెల్లడించారు. అల్లు రామలింగయ్య జయంతి కార్యక్రమంలో నిర్మాత అల్లు అరవింద్, అల్లు అర్జున్, అల్లు శిరీష్, అల్లు బాబీ పాల్గొన్నారు.