https://oktelugu.com/

విద్యార్థులు గెట్ రెడీ: రేపే ఇంటర్ ఫలితాలు

కరోనా కల్లోలంతో పూర్తిగా రద్దు అయిన ఇంటర్ పరీక్షలతో విద్యార్థులు ఊరట చెందారు. పరీక్షలు రాయకుండా పాస్ అయిపోయారు. అయితే వారి ఫలితాలు, మార్కులను రేపు ప్రకటించనున్నారు. ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం ఫలితాలు రేపు వెల్లడిస్తున్నారు.రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వీటిని విడుదల చేస్తున్నారు. ఈ ఫలితాలపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మార్గదర్శకాలు విడుదల చేసింది. ఆయా సబ్జెక్టుల్లో మొదటి ఏడాది మార్కులే రెండో ఏడాదికి కేటాయించనున్నారు. ఇంటర్ రెండో సంవత్సరం ప్రాక్టీకల్స్ కు పూర్తి […]

Written By: , Updated On : June 27, 2021 / 09:33 PM IST
Follow us on

కరోనా కల్లోలంతో పూర్తిగా రద్దు అయిన ఇంటర్ పరీక్షలతో విద్యార్థులు ఊరట చెందారు. పరీక్షలు రాయకుండా పాస్ అయిపోయారు. అయితే వారి ఫలితాలు, మార్కులను రేపు ప్రకటించనున్నారు. ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం ఫలితాలు రేపు వెల్లడిస్తున్నారు.రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వీటిని విడుదల చేస్తున్నారు.

ఈ ఫలితాలపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మార్గదర్శకాలు విడుదల చేసింది. ఆయా సబ్జెక్టుల్లో మొదటి ఏడాది మార్కులే రెండో ఏడాదికి కేటాయించనున్నారు. ఇంటర్ రెండో సంవత్సరం ప్రాక్టీకల్స్ కు పూర్తి మార్కులు వేయనున్నారు.

గతంలో ఫెయిల్ అయిన సబ్జెక్టులకు 35శాతం మార్కులను, బ్యాక్ లాగ్స్ ఉంటే ఆ సబ్జెక్టులను రెండో ఏడాది 35 మార్కులను కేటాయించనున్నారు.అంటే దాదాపు కరోనా దయంతో అందరూ పాస్ అయిపోతున్నారన్న మాట.

ప్రైవేటుగా దరఖాస్తు చేసుకున్న వారికి 35శాతం మార్కులు ఇవ్వనున్నట్టు మార్గదర్శకాల్లో స్పష్టం చేశారు. ఫలితాలతో సంతృప్తి చెందని విద్యార్థులకు పరిస్థితులు మెరుగయ్యాక ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు తెలిపింది.