భారీ ప్ర‌క్షాళ‌న‌.. మోడీ కొత్త‌ కేబినెట్ ఇదే..?

కేంద్రంలో బీజేపీ స‌ర్కారు వ‌రుస‌గా రెండు సార్లు అధికారంలోకి వ‌చ్చింది. మోడీ వేవ్ కు ఎదురు లేక‌పోవ‌డంతో అఖండ మెజారిటీతో కేంద్రంలో ప‌గ్గాలు చేప‌ట్టింది. అయితే.. 2024లో వ‌చ్చే ఎన్నిక‌లను ఎదుర్కోవ‌డం అనేది సాధార‌ణ విష‌య‌మైతే కాదు. ఎందుకంటే.. రెండుసార్లు పాల‌న‌లో ఉంది కాబ‌ట్టి స‌హ‌జ వ్య‌తిరేక‌త అనేది కొంత ఉంటుంది. దీనికి తోడు క‌రోనా నియంత్ర‌ణ‌లో విఫ‌ల‌మైంద‌న్న ప్ర‌చారం ఓవైపు.. రైతు వ్య‌తిరేక చ‌ట్టాలు రూపొందించింద‌న్న మ‌చ్చ మ‌రోవైపు ఉంది. ఈ కార‌ణంగానే శిరోమ‌ణి అకాలీద‌ల్ […]

Written By: Bhaskar, Updated On : June 27, 2021 9:04 pm
Follow us on

కేంద్రంలో బీజేపీ స‌ర్కారు వ‌రుస‌గా రెండు సార్లు అధికారంలోకి వ‌చ్చింది. మోడీ వేవ్ కు ఎదురు లేక‌పోవ‌డంతో అఖండ మెజారిటీతో కేంద్రంలో ప‌గ్గాలు చేప‌ట్టింది. అయితే.. 2024లో వ‌చ్చే ఎన్నిక‌లను ఎదుర్కోవ‌డం అనేది సాధార‌ణ విష‌య‌మైతే కాదు. ఎందుకంటే.. రెండుసార్లు పాల‌న‌లో ఉంది కాబ‌ట్టి స‌హ‌జ వ్య‌తిరేక‌త అనేది కొంత ఉంటుంది. దీనికి తోడు క‌రోనా నియంత్ర‌ణ‌లో విఫ‌ల‌మైంద‌న్న ప్ర‌చారం ఓవైపు.. రైతు వ్య‌తిరేక చ‌ట్టాలు రూపొందించింద‌న్న మ‌చ్చ మ‌రోవైపు ఉంది.

ఈ కార‌ణంగానే శిరోమ‌ణి అకాలీద‌ల్ వంటి పార్టీలు దూర‌మ‌య్యాయి. చిర‌కాల మిత్రులైన శివ‌సేన కూడా విడిపోయింది. ఇన్ని ప్ర‌తికూల ప‌రిస్థితుల నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల యుద్ధానికి బీజేపీ సిద్ధం కావాల్సి ఉంది. అందుకే.. బీజేపీ పెద్ద‌లు ఆచితూచి నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు. ఎన్నిక‌ల‌కు ఇంకా మూడేళ్ల స‌మ‌యం ఉన్న‌ప్ప‌టికీ.. ఇప్ప‌టి నుంచే వ్యూహాలు ర‌చిస్తున్నారు.

ఈ వ్యూహాల్లో ప్ర‌ధాన‌మైన‌ది మంత్రివ‌ర్గ ప్ర‌క్షాళ‌న‌. 2019 ఎన్నిక‌ల్లో గెలిచిన త‌ర్వాత ప‌రిస్థితులకు.. రెండేళ్లు గ‌డిచిన త‌ర్వాత ఇప్ప‌టి ప‌రిస్థితుల‌కు చాలా వ్య‌తాసం ఉంది. ఈ నేప‌థ్యంలోనే భ‌విష్య‌త్ ను అంచ‌నా వేస్తూ మంత్రివ‌ర్గంలో మార్పులు చేర్పులు చేస్తున్నారు. ప్ర‌ధానంగా వ‌చ్చే ఏడాది ఉత్త‌ర ప్ర‌దేశ్ ఎన్నిక‌లు ఉన్న నేప‌థ్యంలో.. అక్క‌డి నుంచి గెలిచిన వారికి పెద్ద మొత్తంలో స్థానం క‌ల్పించే అవ‌కాశం ఉన్న‌ట్టు ప్ర‌చారం సాగుతోంది. ఈ నేప‌థ్యంలో.. చాలా మంది పేర్లు చ‌ర్చ‌లోకి వ‌చ్చాయి.

సుశీల్ మోదీ (బీహార్ ఉప ముఖ్య‌మంత్రి, స‌ర్వానంద సోనోవాల్ (అసోం మాజీ ముఖ్య‌మంత్రి) జ్యోతిరాధిత్య సింధియా (మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాజ్య‌స‌భ‌ ఎంపీ), భూపేంద్ర యాద‌వ్ ( రాజ‌స్థాన్ బీజేపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి), నారాయ‌ణ్ రాణే (మ‌హారాష్ట్ర మాజీ ముఖ్య‌మంత్రి), కైలాస్ విజ‌య వార్గీయ (మ‌ధ్య‌ప్ర‌దేశ్‌), అనిల్ జైన్‌, ప్రీత‌మ్ ముండే (మ‌హారాష్ట్ర‌), వ‌రుణ్ గాంధీ, పంక‌జ్ చౌద‌రి, (స‌య్య‌ద్ జాఫ‌ర్ ఇస్లాం (బీజేపీ అధికార ప్ర‌తినిధి), అనుప్రియా ప‌టేల్ (అప్నాద‌ళ్‌), స్వ‌తంత్ర దేవ్ సింగ్ (యూపీ), జామ్యంగ్ సంగ్యాల్ (ల‌ద్ధాఖ్‌), అశ్విని వైష్ణ‌వ్ (ఒడిశా), సునీత దుగ్గ‌ల్ (హ‌ర్యానా), జైజ‌యంత పాండ‌(ఒడిశా), కిరీట్ బాయ్ సోలంకి (గుజ‌రాత్‌), దినేష్ చ‌తుర్వేది(మాజీ రైల్వే మంత్రి), సీఆర్ పాటిల్ (గుజ‌రాత్ బీజేపీ అధ్య‌క్షుడు), పీపీ చౌధ‌రి (మాజీ కేంద్ర‌మంత్రి), రాజీవ్ చంద్ర‌శేఖ‌ర్ (క‌ర్నాట‌క‌), రాహుల్ క‌వ‌స్వాన్ (రాజ‌స్థాన్‌), ఆర్సీసీ సింగ్ (జేడీయూ), మీనాక్షి లేఖి (ఢిల్లీ), ప‌శుప‌తి ప‌రాస్ (బిహార్‌)