వైద్యుల విధులకు ఆటంకాలు కలిగిస్తే కఠిన చర్యలు: కేంద్రం

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో వైద్య సిబ్బంది పరిరక్షణకు కేంద్రం నడుం బిగించింది. అనేక ప్రాంతాల్లో వైద్యులపై దాడులు జరగడాన్ని కేంద్రం తీవ్రంగా పరిగణిస్తోంది. ఇకమీదట వైద్యుల విధులకు ఆటంకాలు కలిగిస్తే కఠినచర్యలు ఉంటాయని కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ అన్ని రాష్ట్రాలకు లేఖలు పంపింది. తబ్లిగీ జమాత్ కారణంగా రెండ్రోజుల్లో 647 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వెల్లడించింది. ఈ 647 కేసులను 14 రాష్ట్రాల్లో గుర్తించామని పేర్కొంది. […]

Written By: Neelambaram, Updated On : April 4, 2020 11:21 am
Follow us on


దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో వైద్య సిబ్బంది పరిరక్షణకు కేంద్రం నడుం బిగించింది. అనేక ప్రాంతాల్లో వైద్యులపై దాడులు జరగడాన్ని కేంద్రం తీవ్రంగా పరిగణిస్తోంది. ఇకమీదట వైద్యుల విధులకు ఆటంకాలు కలిగిస్తే కఠినచర్యలు ఉంటాయని కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ అన్ని రాష్ట్రాలకు లేఖలు పంపింది. తబ్లిగీ జమాత్ కారణంగా రెండ్రోజుల్లో 647 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వెల్లడించింది.

ఈ 647 కేసులను 14 రాష్ట్రాల్లో గుర్తించామని పేర్కొంది. 960 మంది విదేశీ తబ్లిగీ జమాత్ కార్యకర్తలపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కేంద్రం స్పష్టం చేసింది. ఆరోగ్య ప్రోటోకాల్ పూర్తయ్యాకే వారి దేశాలకు పంపించే ఏర్పాట్లు చేస్తామని తెలిపింది. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో తబ్లీగీ జమాత్ లు వారికి వైద్యం చేస్తున్న వైద్యులు, పారమెడికల్ సిబ్బందితో దురుసుగా ప్రవరించడం, కరోనా వైరస్ వ్యాప్తి చెందే చర్యలకు పూనుకోవడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. యూపీలో వీరిపై జాతీయ భద్రతా చట్టం కింద కేసులు నమోదు చేయనున్నట్లు స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటించారు. ఇతర రాష్ట్రాలలో జమాత్ సభ్యుల ఇళ్ళకు వెళ్లిన వైద్య సిబ్బందికి చేదు అనుభావాలే ఎదురయ్యాయి. దుర్బాషలాడటం, దాడికి యత్నించడం వంటి సంఘటనలు ఆంద్రప్రదేశ్ లోను చోటు చేసుకున్నాయి. దీంతో కేంద్రం ఏ చర్యలకు పూనుకుంది.