భోజనాలు పెట్టిన వ్యక్తికి కరోనా.. కాలనీ వాసులకు ఆందోళన..!

దుబాయ్‌ నుంచి వచ్చిన మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి.. ఆతని తల్లి దశదిన కర్మ సందర్భంగా మార్చి 20న తమ కాలనీ వాసులందరికీ భోజనం పెట్టాడు. దాదాపు 1500 మంది ఇందులో పాల్గొన్నారు. ఆ తర్వాత అతడితో పాటు అతడి కుటుంబంలోని మరో 11 మందికి కరోనా పాజిటివ్‌ అని తేలింది. దీంతో ఆ కాలనీలో భయాందోళనలు నెలకొన్నాయి. దుబాయ్‌లో సురేశ్ అనే వ్యక్తి వెయిటర్‌గా పనిచేస్తున్నాడు. అతడి వ్యక్తి తల్లి గత నెలలో మరణించడంతో గత […]

Written By: Neelambaram, Updated On : April 4, 2020 12:15 pm
Follow us on


దుబాయ్‌ నుంచి వచ్చిన మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి.. ఆతని తల్లి దశదిన కర్మ సందర్భంగా మార్చి 20న తమ కాలనీ వాసులందరికీ భోజనం పెట్టాడు. దాదాపు 1500 మంది ఇందులో పాల్గొన్నారు. ఆ తర్వాత అతడితో పాటు అతడి కుటుంబంలోని మరో 11 మందికి కరోనా పాజిటివ్‌ అని తేలింది. దీంతో ఆ కాలనీలో భయాందోళనలు నెలకొన్నాయి.

దుబాయ్‌లో సురేశ్ అనే వ్యక్తి వెయిటర్‌గా పనిచేస్తున్నాడు. అతడి వ్యక్తి తల్లి గత నెలలో మరణించడంతో గత నెల 17న తన సొంత గ్రామం మొరేనాకు తిరిగొచ్చాడు. ఈ నేపథ్యంలో కాలనీ వాసులకు భోజనాలు పెట్టాడు. ఆ తర్వాత అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరగా అతడితో పాటు, అతని భార్యకు కరోనా సోకినట్టు ఏప్రిల్‌ 2న నిర్ధారణ అయింది.

అతడితో సన్నిహితంగా ఉన్న 23 మందికి పరీక్షలు నిర్వహించారు. దీంతో వారిలో10 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. అతడు దుబాయ్‌ నుంచి బయల్దేరేముందే అతనికి వైరస్‌ సోకిందని వైద్యులు తెలిపారు. అతడు ఉంటోన్న కాలనీ వాసులు ఇళ్లకే పరిమితం కావాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.