లాక్‌డౌన్ వ్యవహారం ఇక రాష్ట్రాలదే…

కేంద్రం ప్రకటించిన దేశ వ్యపేత లాక్‌డౌన్ మూడవ దశ ఆదివారంతో ముగియనున్నది. దీనిని మరింకా కొనసాగించడం అవసరం అంటూనే ఈ సారి వినూత్న రీతీలో అమలు ఉండగలదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో పేర్కొనడం గమనార్హం. ఈ పర్యాయం దేశ్ ఆవ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించకుండా, ఒకొక్క రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులోను బట్టి ప్రకటించి, అమలు పరచే స్వేచ్ఛను రాష్ట్రాలకే కేంద్రం వదిలివేయనున్నట్లు తెలుస్తున్నది. ఈ విషయమై హోమ్ మంత్రి అమిత్ […]

Written By: Neelambaram, Updated On : May 16, 2020 3:19 pm
Follow us on

కేంద్రం ప్రకటించిన దేశ వ్యపేత లాక్‌డౌన్ మూడవ దశ ఆదివారంతో ముగియనున్నది. దీనిని మరింకా కొనసాగించడం అవసరం అంటూనే ఈ సారి వినూత్న రీతీలో అమలు ఉండగలదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో పేర్కొనడం గమనార్హం. ఈ పర్యాయం దేశ్ ఆవ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించకుండా, ఒకొక్క రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులోను బట్టి ప్రకటించి, అమలు పరచే స్వేచ్ఛను రాష్ట్రాలకే కేంద్రం వదిలివేయనున్నట్లు తెలుస్తున్నది.

ఈ విషయమై హోమ్ మంత్రి అమిత్ షా హోమ్ శాఖ అధికారులతో శుక్రవారం నుండి ఎడతెరిపి లేకుండా సమాలోచనలు జరుపుతున్నారు. కేంద్రం స్వయంగా లాక్ డౌన్ ప్రకటించాక పోయినా మొత్తం మీద కరోనా కట్టడిని పర్యవేక్షించడంతో పాటు, రాష్ట్రాలకు అవసరమైన సూచనలు ఇవ్వనున్నది.

తెలంగాణ, పంజాబ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, అసోం రాష్ట్రాల సిఎంలు ఇప్పటికే లాక్‌డౌన్ కొనసాగింపునకే మొగ్గుచూపారు. జోన్లను గుర్తించే విషయంలో తమకు అధికారాలు ఉండాలని, వైరస్ పరిస్థితిని బట్టి గ్రీన్, ఆరెంజ్, రెడ్ జోన్లను ఖరారు చేసుకుంటామని తెలిపారు. ఇక ఉన్నట్లుండి రైళ్లను, అంతరాష్ట్ర బస్సులను నడిపిస్తే వచ్చే సమస్యను తట్టుకోవడం కష్టమని కూడా స్పష్టం చేశారు.

పరిస్థితులను బట్టి , కరోనా వైరస్ తీవ్రతను బట్టి రాష్ట్రాలు ఎటువంటి ఆంక్షలను అమలు చేయాలనేది నిర్ణయించుకోవచ్చని కేంద్ర ప్రభుత్వ అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికే పలు సడలింపులు ఇచ్చిన కేంద్రం రైళ్లు, దేశీయ విమానాల రాకపోకలనుపరిమితంగా పునరుద్ధరించడానికి సహితం సిద్దపడుతున్నది.

దేశవ్యాప్తంగా రెడ్‌జోన్లతో సహా సెలూన్లు, క్షౌరశాలలు, ఆప్టికల్ షాపులను తిరిగి తెరిచేందుకు వీలుంది. అయితే స్కూళ్లు, కాలేజీలు, సిన్మాహాళ్లు మూసే ఉంటాయి. కంటైన్మెంట్ ప్రాంతాలలో మాత్రం ఈ మినహాయింపు ఉండదు. పత్యేకించి గ్రీన్‌జోన్లలో పూర్తి స్థాయిలో లాక్‌డౌన్ వెసులుబాట్లు ఉంటుంది. పరిమిత స్థాయిలో ఆరేంజ్ జోన్లలో ఆంక్షలు ఎత్తివేస్తారు.

రెడ్‌జోన్లలోని కంటైన్మెంట్ ప్రాంతాలలో ఖచ్చితమైన లాక్‌డౌన్ అమలులో ఉంటుంది. రాష్ట్రాల విజ్ఞప్తులను తప్పనిసరిగా పరిశీలనలోకి తీసుకుని ఆమోదించడం జరుగుతుందని అధికారులు తెలిపారు. నియంత్రణలు, ప్రజలు ప్రజా రవాణా కదలికలు, ఆర్థిక కార్యకలాపాల పునః ప్రారంభంపై రాష్ట్రాలు క్షేత్రస్థాయి వాస్తవిక పరిస్థితిని ప్రాతిపదికగా చేసుకుని నిర్ణయం తీసుకునే వీలుందని కేంద్రం చెపుతోంది.

వచ్చే సోమవారం నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలలో పరిమిత సంఖ్యలో స్థానిక మెట్రో రైళ్లు, సబర్బన్ ట్రైన్లు, బస్సులు, తక్కువ సంఖ్యలో, తక్కువ మందితో రెడ్‌జోన్లలో కూడా నడిచే వీలుంది. అయితే కంటైన్మెంట్ ప్రాంతాలలో వీటిని అనుమతించరు. ఆటోలు, టాక్సీలు, క్యాబ్‌లను తక్కువ మందితో అనుమతిస్తారు. రెడ్‌జోన్లతో పాటు అన్ని చోట్ల ఈ కామర్స్ సంస్థలు పనిచేసేందుకు అనుమతిస్తారు. నిత్యావసరేతర వస్తువులను ఆన్‌లైన్ ద్వారా పంపిణీ చేసేందుకు వీలు కల్పిస్తారని వెల్లడైంది.