వర్మ ‘క్లైమాక్స్’ నుంచి మరో అప్డేట్

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ తాజా చిత్రం ‘క్లైమాక్స్’. అమెరికన్ పోర్న్ స్టార్ మియా మాల్కోవాతో సస్పెన్స్ థిల్లర్ గా ‘క్లైమాక్స్’ ను తెరకెక్కిస్తున్నారు. ఈనెల 14న సాయంత్రం 5గంటలకు ఈ మూవీకి సంబంధించిన టీజర్ విడుదల చేశాడు. సోషల్ మీడియాలో విడుదలై కొన్ని క్షణాల్లోనే ‘క్లైమాక్స్’ టీజర్ ట్రెండింగ్లోకి దూసుకెళ్లింది. కేవలం రెండ్రోరోజుల్లోనే మిలియన్ వ్యూస్ దాటేసి రికార్డు సృష్టించింది. ఇదే విషయాన్ని వర్మ తన సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఈ సందర్భంగా నేడు(శనివారం) సాయంత్రం […]

Written By: Neelambaram, Updated On : May 16, 2020 3:06 pm
Follow us on

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ తాజా చిత్రం ‘క్లైమాక్స్’. అమెరికన్ పోర్న్ స్టార్ మియా మాల్కోవాతో సస్పెన్స్ థిల్లర్ గా ‘క్లైమాక్స్’ ను తెరకెక్కిస్తున్నారు. ఈనెల 14న సాయంత్రం 5గంటలకు ఈ మూవీకి సంబంధించిన టీజర్ విడుదల చేశాడు. సోషల్ మీడియాలో విడుదలై కొన్ని క్షణాల్లోనే ‘క్లైమాక్స్’ టీజర్ ట్రెండింగ్లోకి దూసుకెళ్లింది. కేవలం రెండ్రోరోజుల్లోనే మిలియన్ వ్యూస్ దాటేసి రికార్డు సృష్టించింది. ఇదే విషయాన్ని వర్మ తన సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఈ సందర్భంగా నేడు(శనివారం) సాయంత్రం 5గంటలకు మియా మాల్కోవాపై షూట్ చేసిన ‘జస్ట్ డూ ఇట్.. ఫ్రీక్ అవుట్’ అనే మ్యూజికల్ వీడియోను రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించాడు.

కాగా వర్మ విడుదల చేసిన ‘క్లైమాక్స్’ టీజర్ హాలీవుడ్ స్టైల్లో అదిరిపోయింది. ఇసుక తిన్నెల్లో మియా మాల్కోవా అందాలు ప్రతీఒక్కరిని ఆకట్టుకునేలా ఉన్నాయి. వర్మ గతంలోనూ వర్మ మియా మాల్కోవాతో గాడ్ సెక్స్ అండ్ ట్రూత్(GST)అనే డాక్యుమెంటరీని తెరకెక్కించాడు. ఇందులో మియా మాల్కోవా నగ్నంగా నటించగా ‘క్లైమాక్స్’లో మాత్రం దస్తుల్లో కన్పించడం విశేషం. ఈ మూవీ ట్రైలర్ 18న రిలీజ్ చేయనున్నట్లు వర్మ టీజర్లో నే ప్రకటించాడు. తాజాగా నేటి సాయంత్రం మియా మాల్కోవాపై షూట్ చేసిన మ్యూజికల్ వీడియో సాంగ్ విడుదల చేస్తానని ప్రకటించడంతో అభిమానులు అత్రుతగా ఎదురుచూస్తున్నారు. టీజర్ తోనే సంచలనం సృష్టించిన వర్మ ఈ మ్యూజికల్ సాంగ్స్ తో ఎలాంటి రికార్డులు సృష్టిస్తాడో వేచి చూడాల్సిందే..!