https://oktelugu.com/

కాంట్రవర్సీ ట్వీట్ తో మహేష్, బన్నీ ఫ్యాన్స్ దగ్గర బుక్కైన సమంత

సోషల్ మీడియా యుగంలో ఏ విషయంపై స్పదించాలన్నా, కామెంట్ చేయాలన్నా… వాడే పదాలు పదిసార్లు చెక్ చేసుకోవాలి. లేదంటే బుక్కైపోవడం ఖాయం. సెలెబ్రిటీలు ఈ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ఇబ్బందులు తప్పవు. ఇప్పుడు సమంత అదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. సమంత చేసిన ఓ ట్వీట్ మహేష్, బన్నీ అభిమానుల కోపానికి కారణం కాగా, ఆమెపై సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడుతున్నారు. Also Read: బిగ్ బాస్-4 విజేత ఆ ఇద్దర్లోనే..! సుధా కొంగర దర్శకత్వంలో […]

Written By:
  • admin
  • , Updated On : December 10, 2020 / 10:55 AM IST
    Follow us on


    సోషల్ మీడియా యుగంలో ఏ విషయంపై స్పదించాలన్నా, కామెంట్ చేయాలన్నా… వాడే పదాలు పదిసార్లు చెక్ చేసుకోవాలి. లేదంటే బుక్కైపోవడం ఖాయం. సెలెబ్రిటీలు ఈ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ఇబ్బందులు తప్పవు. ఇప్పుడు సమంత అదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. సమంత చేసిన ఓ ట్వీట్ మహేష్, బన్నీ అభిమానుల కోపానికి కారణం కాగా, ఆమెపై సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడుతున్నారు.

    Also Read: బిగ్ బాస్-4 విజేత ఆ ఇద్దర్లోనే..!

    సుధా కొంగర దర్శకత్వంలో సూర్య హీరోగా తెరకెక్కిన బయోపిక్ సురారై పోట్రు. తెలుగులో ఆకాశం నీ హద్దురా పేరుతో విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులోకి వచ్చిన ఈ మూవీలో సూర్య నటన, సుధా టేకింగ్ అద్భుతం అంటూ ప్రశంసలు దక్కాయి. ఇటీవల ఈ చిత్రాన్ని చూసిన సమంత కాంప్లిమెంట్ చేస్తూ ఓ ట్వీట్ చేసారు.

    Also Read: ప్రభాస్ పక్కన ఛాన్స్.. ఆ సువర్ణావకాశం మీకు దక్కాలంటే ?

    ఈ క్రమంలో సురారై పోట్రుని మూవీ ఆఫ్ ది ఇయర్ అనేసింది. ఇది మహేష్, బన్నీ ఫ్యాన్స్ కి కాలేలా చేసింది. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురంలో భారీ విజయాలను నమోదు చేశాయి. సరిలేరు నీకెవ్వరు మహేష్ కెరీర్ బెస్ట్ వసూళ్లు సాధించగా, అల వైకుంఠపురంలో బన్నీ పేరిట ఇండస్ట్రీ హిట్ నమోదు చేసింది. అలాంటి రెండు చిత్రాలను కాదని, సమంత… సూర్య నటించిన ఆకాశం నీ హద్దురా చిత్రాన్ని మూవీ ఆఫ్ ది ఇయర్ అనడం వాళ్లకు నచ్చడం లేదు. దీనితో సమంతపై ట్రోల్స్ కి తెగబడ్డారు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్