Garikapati- Bhavani Ravikumar: మెగాస్టార్ చిరంజీవిని హైదరాబాద్ లో నిర్వహించిన ‘అలయ్ బలయ్’ కార్యక్రమంలో అవమానించేలా మాట్లాడిన ప్రముఖ ప్రవచనకర్త ‘గరికపాటి నర్సింహారావు’పై విమర్శల వర్షం కురుస్తోంది. ముఖ్యంగా మా చిరంజీవిని అవమానిస్తారా? అని మెగా అభిమానులంతా కూడా గరికపాటిపై సోషల్ మీడియాలో దుమ్మెత్తి పోస్తున్నారు. ట్రోల్స్, మీమ్స్ తో టార్గెట్ చేశారు. గరికపాటి చేసింది తప్పు అని చాలామంది అభిప్రాయపడుతున్నారు.

ఇక గరికపాటి నంబర్ ను మెగా అభిమానులంతా తీసుకొని ఆయనకు ఫోన్లు చేసి మరీ తిట్టిపోస్తున్నారు. అనంతపురానికి చెందిన చిరంజీవి యువత రాష్ట్ర అధ్యక్షుడు భవానీ రవికుమార్ కూడా గరికపాటికి ఫోన్ చేశారు. కానీ అందరిలో ఆయనను తిట్టకుండా పద్ధతిగా మాట్లాడారు. ‘మిమ్మల్ని బాధపెట్టాలని నేను ఫోన్ చేయడం లేదని.
ప్రముఖ విధ్వాంసులైన మీరు చిరంజీవిని అలా అనడం తమకు బాధ కలిగిందని.. మీరు ఎందుకలా ప్రవర్తించారు.? మా అభిమానులు ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టారా? మీకు వంగి నమస్కారం చేసిన చిరంజీవి ఎంతో సంస్కారవంతుడని.. మీరు ఏమీ అనుకోకుండా చిరంజీవిని కలిసి మాట్లాడాలని..’ సూచించారు.

చిరంజీవిది సంస్కారం అని.. ఆయనకు ఇబ్బంది పెట్టుంటే తాను స్వయంగా ఫోన్ చేసి మాట్లాడి వివరణ ఇస్తానని గరికపాటి బదులిచ్చారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చిరంజీవిలాగానే ఆయన అభిమానులు, అభిమాన సంఘం నేతలు కూడా ఇంత పద్ధతిగా, హుందాగా చిరంజీవిని బాధపెట్టిన గరికపాటిని గౌరవించి ఆయన తప్పును సుతిమెత్తగా చెప్పిన తీరుపై ప్రశంసలు కురుస్తున్నాయి. చిరంజీవి యువత అధ్యక్షుడు మాట్లాడిన పరిణతి నిజంగా అద్భుతమని.. గరికపాటి ఇప్పటికైనా తన తప్పు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని పలువురు హితవు పలుకుతున్నారు.
[…] […]
[…] […]