Jabardast Appa Rao: ‘శ్రీవల్లి’ పాటకు రైనా స్టెప్పులు వేసి ఆ వీడియోను మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ చిత్రానికి సినీప్రియులే కాదు, ప్రముఖ ప్రముఖులు కూడా ఫిదా అవుతున్నారు. ఇటీవల వార్నర్, జడేజా వంటి క్రికెటర్లు సోషల్ మీడియా వేదికగా ‘తగ్గేదే లే’ అంటూ నెటిజన్లను ఫిదా చేశారు. ఇప్పుడు ఇదే జాబితాలోకి భారత మాజీ క్రికెటర్, చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు సురేశ్ రైనా వచ్చి చేరాడు.

ఇక మరో అప్ డేట్ విషయానికి వస్తే.. ‘టెర్మినేటర్’ హీరో ఆర్నాల్డ్ ష్వార్జ్నెగ్గర్ కారు ప్రమాదానికి గురి అయింది. కాగా ఈ ఘటనలో ఓ మహిళకు స్వల్ప గాయాలు అయ్యాయి.అయితే, ఆర్నాల్డ్ కు ఎలాంటి గాయాలు కాలేదు. కానీ మహిళ ఆరోగ్యంపై ఆర్నాల్డ్ ఆందోళన వ్యక్తం చేశారని ఆర్నాల్డ్ ప్రతినిధి చెప్పారు. అయితే ఆర్నాల్డ్ డ్రగ్స్, ఆల్కహాల్ తీసుకున్న ఆనవాళ్లు ఏం కనిపించలేదని ఈ ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Also Read: ఎంత చేసినా ఏపీలో బీజేపీని ఎవరూ పట్టించుకోవట్లేదే.. ఇలా అయితే ఎలా..?

ఇక ఏపీలో చింతామణి నాటకంపై ప్రభుత్వం నిషేధం విధించింది. అయితే, అలా విధించడాన్ని కళాకారులు, తెలుగు భాషా ప్రేమికులు ఒప్పుకోవడం లేదు. పైగా నిరసన కూడా వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు విశాఖలోని మద్దిలపాలెం జంక్షన్‌లో కళాకారులు నిరసన కార్యక్రమంలో చేపట్టారు. ఈ కార్యక్రమంలో జబర్దస్త్ నటుడు అప్పారావు కూడా పాల్గొని.. చింతామణి నాటకంపై ఏపీ ప్రభుత్వం విధించిన నిషేధాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరాడు. జబర్దస్త్ అప్పారావు కోరికను జగన్ పట్టించుకోడు అనుకోండి.
Also Read: పవన్ కెరీర్లోనే ‘భీమ్లా నాయక్’ బెస్ట్ అట.. థమన్ షాకింగ్ కామెంట్స్ !