ప్రతి ప్రాణికి ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంటుంది. అందులో మనిషి జీవితంలో మాత్రం ఎన్నో అంతుపట్టని సమస్యలు వస్తుంటాయి. నిజానికి వాటిని లోతుగా పరిశీలిస్తే వెంటనే వాటికి సమాధానాలు దొరుకుతాయి. కానీ లోతుగా పరిశీలించే స్తోమత లేకపోవడంతో కష్టాలను ఎదుర్కొంటూ ఉంటారు. కాబట్టి జీవితంలో కష్టాలు ఉండకూడదు అంటే చాణక్యుడు చెప్పినట్లు చేస్తే సరిపోతుంది. ఇంతకు అవేంటంటే!

తల్లిదండ్రులను, దేవతలు, సాధువులను, గురువులను గౌరవిస్తూ ఉండాలి. ఇక చేయబోయే పనులలో సత్కార్యములు ఉండేలా జాగ్రత్తలు చూసుకోవాలి. ప్రతి ఒక్క విషయంలో ఆత్మపరిశీలన అనేది చాలా ముఖ్యం. ఏదైనా విజయాన్ని సాధించాలంటే ముందర అపజయ రుచి చూసి ఉండాలి. ప్రతి ఒక్కరు ఏదో ఒక విషయంలో సంతృప్తి చెంది ముందుకు నడవాలి.

ముఖ్యంగా కర్మ ప్రతి ఒక్కరిని అనుసరిస్తుంది. కాబట్టి ఏ పనులైన జాగ్రత్తగా చేయాలి. వేదాలు, మత గ్రంధాలు చదివిన వారి కంటే కూడా సొంత ఆత్మను గ్రహించకపోతే ఆ సొంత జ్ఞానం కూడా వ్యర్థం అవుతుంది. అంతేకాకుండా ఎదురయ్యే సమస్యలకు పరిష్కారాలు ఏంటో లోతుగా గ్రహించాలి.
ఏ విషయం అయినా లోతుగా గ్రహిస్తే.. వెంటనే పరిష్కారం అందుతుందని చాణక్యుడు తెలుపుతున్నారు. అలా ప్రతి ఒక్క విషయంలో సరైన ఆలోచన ఉంటే అనుకున్న లక్ష్యానికి చేరే అవకాశం సులువుగా ఉంటుంది. ఇక ఏ విషయాలైనా అవగతం చేసుకొని ముందుకు సాగితే కష్టాలు ఉండవని తెలుస్తుంది. కాబట్టి ఈ విషయాలను మీరు ఫాలో అవుతే వెంటనే కష్టాల నుండి బయటపడతారు.
[…] Tollywood Crazy Updates: హీరో నవదీప్ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటాడు. కాగా పెళ్లి చేసుకోవాలని నెటిజన్లు ఇచ్చిన సలహాకు హీరో నవదీప్ కౌంటర్ ఇచ్చాడు. ‘అన్నా నీ గడ్డం తెల్లబడుతోంది. త్వరగా పెళ్లి చేసుకో అని కొంతమంది నాకు సలహాలు ఇస్తున్నారు. గడ్డం తెల్లబడితే చేయాల్సింది ట్రిమ్మింగ్.. పెళ్లి కాదు. దురద పుడితే గోక్కుంటాం కానీ తోలు పీకేసుకోం కదా’ అని నవదీప్ ఇచ్చిన కౌంటర్ సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారింది. ముఖ్యంగా . దురద పుడితే గోక్కుంటాం కానీ తోలు పీకేసుకోం కదా అంటూ నవదీప్ చెప్పిన డైలాగ్ బాగా ట్రెండ్ అవుతుంది. […]