SSC MTS Result 2024 : ఇటీవల స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) ఎంటీఎస్, హవిల్దార్ రిక్రూట్‌మెంట్ పరీక్ష ఆన్సర్ కీని విడుదల చేయబడింది. దీంతో ఇప్పుడు అభ్యర్థులు ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. అయితే, ఎంటీఎస్ ఫలితాలకు సంబంధించిన కీలక అప్ డేట్ లు ఒకదాని తర్వాత ఒకటి వస్తున్నాయి. ముస్తీ టాస్కింగ్ స్టాఫ్, హవల్దార్ రిక్రూట్‌మెంట్ రాత పరీక్ష ఫలితాలు త్వరలో ప్రకటించబడతాయి. దీని తర్వాత, అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ ssc.gov.inలో చెక్ చేసుకోవచ్చు. ఈ అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను చూడటానికి, అభ్యర్థులు తమ రోల్ నంబర్, పాస్‌వర్డ్‌ను నమోదు చేయాలి.
ఇంతకుముందు, ఎస్సెస్సీ ఎంటీఎస్, హవల్దార్ రిక్రూట్‌మెంట్ పరీక్షలను 30 సెప్టెంబర్ నుండి 14 నవంబర్ 2024 వరకు వేర్వేరు షిఫ్ట్‌లలో నిర్వహించారు. ఈ కంప్యూటర్ ఆధారిత పరీక్ష బహుళైచ్ఛిక(మల్టిపుల్ ఛాయిస్) ప్రశ్నలలో నిర్వహించబడింది. రెండు సెషన్లు ఉన్నాయి. ప్రతి సెషన్‌కు 45 నిమిషాల సమయం ఇవ్వడం జరిగింది. పరీక్ష తర్వాత, ఎస్ ఎస్సీ ఎంటీఎస్, హవల్దార్ రిక్రూట్‌మెంట్ పరీక్ష 2024 ఆన్సర్ కీని 29 నవంబర్ 2024న విడుదల చేసింది. ఎస్ ఎస్సీ ఎంటీఎస్, హవల్దార్ రిక్రూట్‌మెంట్ ఆన్సర్ కీ ద్వారా, అభ్యర్థులు పరీక్షలో వారి స్కోర్‌లపై అభ్యంతరం వ్యక్తం చేయవచ్చు. ఎవరి సమాధానాలపై వారికి సందేహాలు ఉన్నాయి.
ఫలితాన్ని ఎలా చెక్ చేసుకోవాలంటే
1- ముందుగా SSC ssc.gov.in అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లాలి.
2- ఇప్పుడు హోమ్‌పేజీలో కనిపించే రిజల్ట్స్ విభాగానికి వెళ్లండి.
3- ఇక్కడ ఎస్సెస్సీ ఎంటీఎస్, హవల్దార్ రిజల్ట్స్ 2024 పీడీఎఫ్ లింక్‌పై క్లిక్ చేయండి. (ఫలితాలు వెలువడిన తర్వాత)
4- ఇప్పుడు మీ రోల్ నంబర్, పేరును ఎంటర్ చేసి సెర్చ్ బటన్ ప్రెస్ చేయాలి. భవిష్యత్తు కోసం PDF ఫైల్‌ను స్టోర్ చేసుకోవాలి.
ఎస్సెస్సీ, హవల్దార్ ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ మొత్తం 9583 పోస్టులకు కావడం గమనార్హం. ఇందులో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (ఎంటీఎస్) 6144 ఖాళీలు ఉండగా, హవిల్దార్ 3439 ఖాళీలు ఉన్నాయి. అయితే, అభ్యర్థులు ఫలితాలకు సంబంధించిన తాజా అప్‌డేట్‌ల కోసం ఎస్సెస్సీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.