Tips For Mental Health: మానసికంగా దృఢంగా ఉండాలంటే ఆందోళనలు తగ్గించుకోవాలి. ఒంటరితనాన్ని దూరం చేసుకోవాలి. తరచూ ప్రకృతిని ఆస్వాదించే పర్యటనలు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. దీంతో మనలో మానసిక దృఢత్వం పెరుగుతుంది. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి. అనవసరంగా ఆగ్రహం తెచ్చుకోకూడదు. మంచి ఆలోచనలు మన మెదడును సరైన మార్గంలో నడిపిస్తాయి. ఇంకా ఎదుటి వారికి సహాయం చేయాలి. ప్రేమగా మాట్లాడాలి. చిన్నారులతో సరదాగా గడపాలి. అప్పుడే మనకు మానసిక స్థైర్యం ఏర్పడుతుంది.

మనసుకు బాధ కలిగినప్పుడు ఆప్తులతో ఆప్యాయంగా మాట్లాడితే సరిపోతుంది. స్నేహితులతో బాధలు పంచుకోండి. మనసు భారం తగ్గి మానసికంగా దృఢం కావచ్చు. ఆర్థిక ఇబ్బందులు కూడా మనకు శిరోభారం కలిగిస్తాయి. వీటిని దూరం చేసుకోవడమే ఉత్తమం. అవసరానికి డబ్బు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. నిద్ర కూడా మన మానసిక స్థితిపై ప్రభావం చూపుతుంది. సరైన సమయంలో నిద్రపోతూ కనీసం రోజుకు ఆరుగంటలైనా నిద్ర పోయేలా చూసుకోవాలి.
శారీరకంగా కూడా ఇబ్బందులు లేకుండా చూసుకుంటే సరిపోతుంది. రోజు వ్యాయామం చేస్తే శారీరక సమస్యలు కూడా దరిచేరవు. ఇంట్లో డ్యాన్సు చేస్తే కూడా మన శరీరం మంచి ఆకృతి పొందుతుంది. తోటపని, ఇంటిపని చేస్తే కూడా వ్యాయామం చేసినట్లు అవుతుంది. ఆరోగ్యాన్ని కాపాడుకుంటే ఎలాంటి ఇబ్బందులు రావు. ధ్యానం, యోగా చేయడం కూడా మన శారీరక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఉదయం పూట కొంత సమయం ధ్యానం చేస్తే మనసు ప్రశాతంగా ఉంటుంది. తద్వారా భావోద్వేగం రాకుండా నియంత్రించుకోవచ్చు.
ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే లాభం ఉంటుంది. తగినంత నీరు తీసుకోవాలి. రోజుకు కనీసం ఐదు లీటర్ల నీరు తాగితే ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కాఫీ, టీలకు దూరంగా ఉంటేనే శ్రేయస్కరం. భవిష్యత్ పై ఆశావహ దృక్పథం కలిగి ఉంటే మంచిది. మానసికంగా దృఢంగా ఉండాలంటే మన విశ్వాసాలు కూడా తోడ్పడతాయి. మానసికంగా దృఢంగా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకుని పాటిస్తే సరిపోతుంది. జీవితంలో ఎలాంటి బాధలకు గురి కాకుండా వ్యవహరిస్తూ నందనవనం చేసుకుంటే సరిపోతుంది.