TRS vs BJP: తెలంగాణలో రాజకీయాలు వేడెక్కాయి. బీజేపీ, టీఆర్ఎస్ మధ్య నెలకొన్న విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను హత్య చేసేందుకు పథకం పన్నారనే నెపంతో ఢిల్లీలోని మాజీ ఎంపీ, బీజేపీ నాయుకులు జితేందర్ రెడ్డి ఇంటికి పోలీసులు వెళ్లడంతో బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ పోలీసుల తీరుపై కేసు పెడుతున్నారు. పోలీసుల నిర్వాకంతో తమ ప్రతిష్టకు భంగం కలిగిందని వాపోతున్నారు.
పోలీసుల అత్యుత్సాహమే కొంప ముంచినట్లు తెలుస్తోంది. ఏదైనానేరం జరిగితే అందులో నిజానిజాలు తెలుసుకోకుండా అనవసరంగా వివాదాల్లోకి లాగడంపై బీజేపీ నేతలు ఫైర్ అవుతున్నారు. పోలీసుల నిర్ణయం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మాజీ ఎంపీపై పోలీసులు తీసుకున్న నిర్ణయం వివాదాల్లోకి లాగుతోంది. దీంతో పోలీసుల చర్య అందరిలో ఆశ్చర్యం కలిగిస్తోంది.
ఇప్పటికే జితేందర్ రెడ్డి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ప్రమేయం ఉందంటూ అనుమానాలు వ్యక్తం చేయడం కూడా టీఆర్ఎస్ వ్యూహంలో భాగంగానే తెలుస్తోంది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ నేతలు ఢిల్లీలో సీబీఐ సాయం కోరితే అది కేంద్ర దర్యాప్తు సంస్థ కావడంతో తమ చెప్పు చేతుల్లో ఉండదని తెలుసుకుని పోలీసుల సహకారం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పోలీసులు వ్యవహరించిన తీరు వివాదాస్పదమవుతోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీపైనే టీఆర్ఎస్ ఉద్దేశ పూర్వకంగా పీకే వ్యూహంలో భాగంగా కేసుల వరకు వెళ్లడం గమనార్హం.
హుజురాబాద్ ఉప ఎన్నిక తరువాత బీజేపీని ఎదుర్కోవాలనే ఉద్దేశంతోనే టీఆర్ఎస్ ఇలాంటి చౌకబారు పనులకు తెగబడుతున్నట్లు సమాచారం. ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా బీజేపీ శక్తిని ఆపలేరనే విషయం తెలియడంతోనే ఇలా దొడ్డిదారిలో వెళుతున్నట్లు తెలుస్తోంది. ఏదిఏమైనా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని రాజకీయంగా దెబ్బతీయాలని చూడటం కేసీఆర్ అత్యాశగానే చెబుతున్నారు. దీంతో టీఆర్ఎస్ ఆడుతున్న కట్టుకథలకు అదే బాధ్యత వహించాల్సి ఉంటుందనే విషయం తెలుసుకోవడం లేదు.
రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ కు కష్టాలు తప్పేలా లేవు. దీంతో బీజేపీని అప్రదిష్ట పాలు చేసేందుకు కంకణం కట్టుుకున్నట్లు కనిపిస్తోంది. దీంతోనే ఇలాంటి వ్యవహారాలకు తెర తీస్తోంది. కానీ తానే అబాసుపాలవుతోంది. ప్రజల్లో చులకన అయిపోతోంది. విద్వేషపూరితంగా ఆలోచిస్తూ తన భవితవ్యాన్ని తానే నాశనం చేసుకుంటుందనే అభిప్రాయం పలువురిలో వస్తోంది.