OKTelugu Movie Time : మూవీ టైమ్ నుంచి ప్రజెంట్ టాలీవుడ్ అప్ డేట్స్ విషయానికి వస్తే.. మోసగాళ్లు వంటి భారీ డిజాస్టర్ తర్వాత మంచు విష్ణు మళ్లీ ఓ చిత్రాన్ని మొదలుపెట్టాడు. ఈసారి కామెడీతో కడుపుబ్బా నవ్వించేందుకు ప్రయత్నిస్తున్నాడు. మా ప్రెసిడెంట్ అయిన తర్వాత మంచు విష్ణు రేంజ్ పెరిగిందని అభిమానులు భావిస్తుండగా, తన తదుపరి చిత్రం గురించి ట్విట్టర్‌లో తెలిపాడు విష్ణు. కోన వెంటక్ రాసిన కథతో గాలి నాగేశ్వరరావుగా మంచు విష్ణు రాబోతున్నాడట. ఇటీవలే ఫస్ట్ లుక్‌ని ట్విట్టర్‌లో పెట్టాడు.

మరో అప్ డేట్ ఏమిటంటే.. అప్పట్లో ఇంద్ర చిత్రంలోని డైలాగులకి ప్రత్యేక ఆడియో క్యాసెట్ వదిలారు. తర్వాత పలు చిత్రాలకు ఆ ఒరవడి కొనసాగింది. అయితే చాలాకాలం తర్వాత మళ్లీ పుష్ప ఈ ఫీట్ సాధించింది. పుష్పలో బన్నీ తనదైన శైలిలో చెప్పిన డైలాగులు ప్రపంచవ్యాప్తంగా బాగా పేలాయి. ఈక్రమంలో పుష్పలోని బన్నీ డైలాగులను డైలాగ్ జ్యూక్ బాక్స్‌గా విడుదల చేసింది ఆదిత్య మ్యూజిక్. ఇలా డైలాగ్ జ్యూక్ బాక్స్ విడుదల చేసుకున్న చిత్రం ఇదే.

ఇక మరో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఏమిటంటే.. మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి తనయుడు గాలి కిరీటి కన్నడ, తెలుగు ఇండస్ట్రీకి హీరోగా పరిచయంగా కాబోతున్నాడు. ప్రముఖ దర్శకుడు SS రాజమౌళి క్లాప్‌కొట్టి షూటింగ్‌ను ప్రారంభించాడు. ఈ చిత్ర షూటింగ్ బెంగళూరులో లాంఛనంగా ప్రారంభమైంది.

కాగా కిరీటికి సంబంధించిన పరిచయ వీడియోను లాంఛనంగా ఆవిష్కరించారు. రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని వారాహి చలన చిత్ర పతాకంపై సాయి కొర్రపాటి నిర్మిస్తున్నారు.