https://oktelugu.com/

షోలో ఆ తల్లీకూతుళ్లు ఉండాల్సిందేనట !

తెలుగు ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఫేమస్ అయిన అతి కొద్దిమందిలో సురేఖా వాణి ఒకరు. ఎదిగిన కూతురు ఉన్న, ఇంకా హాట్ లుక్స్ లో కనిపించడానికి చాలా కష్టపడుతూ ఉంటుంది సురేఖా. ఏమైనా సురేఖా వాణి అంటే.. అదొక తెలియని ఆకర్షణ అంటున్నారు నెటిజన్లు. కూతురుని కూడా తన దారిలోనే పెంచుతూ గ్లామర్ ప్రపంచంలో తన కుటుంబానికంటూ ఒక ప్రత్యేకతను చాటుకుంటుంది. అందుకే సురేఖా వాణి అనగానే ఇప్పుడు కుర్రకారు కూడా బాగా ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. ఒక […]

Written By:
  • admin
  • , Updated On : August 27, 2020 / 10:27 AM IST
    Follow us on


    తెలుగు ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఫేమస్ అయిన అతి కొద్దిమందిలో సురేఖా వాణి ఒకరు. ఎదిగిన కూతురు ఉన్న, ఇంకా హాట్ లుక్స్ లో కనిపించడానికి చాలా కష్టపడుతూ ఉంటుంది సురేఖా. ఏమైనా సురేఖా వాణి అంటే.. అదొక తెలియని ఆకర్షణ అంటున్నారు నెటిజన్లు. కూతురుని కూడా తన దారిలోనే పెంచుతూ గ్లామర్ ప్రపంచంలో తన కుటుంబానికంటూ ఒక ప్రత్యేకతను చాటుకుంటుంది. అందుకే సురేఖా వాణి అనగానే ఇప్పుడు కుర్రకారు కూడా బాగా ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. ఒక గ్లామర్ హీరోయిన్ కి ఉండే క్రేజ్ ను ఈ ముదురు నటికి కట్టబెడుతున్నారు. చాలా సినిమాల్లో హీరోలకు అక్కగా, అమ్మగా నటించినా.. ఈ ఆంటీలో కుర్రకారు మాత్రం హీరోయిన్ ఫీచర్స్ నే చూస్తారు. ఒకవిధంగా ఆమెకు పాపులారిటీ రావడానికి కారణం కూడా అదే.

    Also Read: హీరోయిన్ మూడో భర్తకు మళ్లీ గుండెపోటు !

    ఆ పాపులారిటీని ఇంకా పెంచుకుంటూ పోతూ ఉంది సురేఖా. కరోనా సమయంలో కూడా సినిమాల షూటింగ్ లు గట్రా ఏవీ లేకపోయినా సరే.. సురేఖా మాత్రం సోషల్ మీడియాలో హాట్ ఫోజులతో కుర్రాళ్ళను రెచ్చగొడుతుంది. తనతో పాటు తన కూతురు సుప్రితతో కలిసి చిందులు వేస్తూ.. కూతుర్ని గ్లామర్ ప్రపంచానికి పరిచయం చేస్తోంది. సురేఖా ఆమె కూతురు డ్యాన్సులకు సంబంధించిన వీడియోలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. ఆ రకంగా వాళ్లకంటూ ఓ ఫ్యాన్ బేస్ క్రియేట్ అయింది. ఆ ఫ్యాన్స్ ఆనందం కోసం తల్లీకూతుళ్లు కూడా సోషల్ మీడియాలో బాగానే వీడియోలు పెడుతూ వస్తున్నారు. ఈ తతంగం అంతా గమనించిన బిగ్ బాస్ యాజమాన్యం ఈ తల్లీకూతుళ్లు ఇద్దరినీ బిగ్ బాస్ 4 లోకి తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు.

    Also Read: పెంపుడు కుక్కతో ప్రేమలో పడ్డ హీరోయిన్ !

    ఇలా వాళ్ళు ప్లాన్ చేశారో లేదో.. అప్పుడే తల్లీకూతుళ్లును బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకున్నారంటూ వార్తలు కూడా పుట్టుకొచ్చేసాయి. సురేఖా వాణి కుటుంబ సమేతంగా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తోందా? ఎంట్రీ ఇస్తే మాత్రం.. షోలో మసాలా డోస్ కాస్త రెట్టింపు అయినట్టే. ఇక ఈ విషయం పై సురేఖ వాణి కూతురు సుప్రితను లైవ్ లో కొంతమంది నెటిజన్లు అడిగారు. మీరు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తున్నారా అని. కానీ తెలివిగా సమాధానాన్ని దాటవేసింది సుప్రిత. ఎంతైనా తల్లికి తగ్గ తనయ అనిపించుకుంది. మరోవైపు సురేఖా వాణిని ఆమె కూతురు సుప్రితను బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకోవాలని… వాళ్ళు వస్తే.. ఫన్ అన్ లిమిటెడ్ అని సోషల్ మీడియాలో మొత్తానికి నెటిజన్లు తెగ కామెంట్స్ చేస్తున్నారు.