AP Land Rates: తెలంగాణలో భూముల విలువను ఇప్పటికే రెండు సార్లు ప్రభుత్వం పెంచిన సంగతి అందిరికీ విదితమే. కాగా, ఏపీలోనూ ఆస్తుల విలువను పెంచుతున్నారు. వచ్చే ఏప్రిల్ నుంచి ఆస్తుల కొత్త మార్కెట్ విలువలు అమలులోకి రాబోతున్నాయి. ఏపీలో ఇటీవల జిల్లాల పునర్విభజన జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయ జిల్లాల్లో మార్కెట్ విలువలు సవరించేలా ఏపీ సర్కారు కసరత్తు చేస్తోంది.
ఈ క్రమంలోనే ఆస్తుల విలువ పెరిగన క్రమంలో రిజిస్ట్రేషన్ చార్జీలు పెరగనున్నాయి. గతేడాది ఆగస్టు నుంచి పట్టణ, గ్రామీణ ప్రాంతాలను గ్రిడ్స్ గా విభజించి కొత్త మార్కెట్ విలువలను ఖరారు చేశారు. కానీ, కొవిడ్ పరిస్థితుల నేపథ్యంలో ఆ డెసిషన్ వాయిదా వేశారు. ఈ ఏడాది మార్చి 31 వరకు పాత చార్జీలే అమలులో ఉంటాయని చెప్పారు. తాజాగా ఏప్రిల్ 1 నుంచి సవరించే మార్కెట్ విలువలు అమలులోకి వస్తాయని స్పష్టం చేశారు.
Also Read: చలో విజయవాడ సక్సస్.. ప్రభుత్వం వెనక్కి తగ్గాల్సిందేనా?
ఆస్తుల విలువ సవరణకు ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు కూడా ఇచ్చింది. అయితే, ఇందులో కొన్ని ప్రాంతాలకు ఫిబ్రవరి 1 నుంచే కొత్త విలువలు అమలులోకి వచ్చాయి. అవేంటంటే..గుంటూరు జిల్లా బాపట్ల, నరసరావుపేట పరిధిలోని కొన్ని గ్రామాల్లో ఫిబ్రవరి 1 నుంచే మార్కెట్ విలువలు అమలులోకి వచ్చాయి. ఈ పట్టణాలను ప్రభుత్వం ఇటీవల జిల్లాలుగా ప్రకటించింది.
ఈ పట్టణాలకు సమీపంలో స్థలాల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ఈ విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం ఆస్తుల విలువ పెంచేసింది. నరసరావుపేట శివారు గ్రామాల్లో ఆస్తుల విలువ పెంపు వంద శాతంగా ఉంది. బాపట్ల సిటీలోని ఈస్ట్ బాపట్ల, కర్రపాలెం, వెస్ట్ బాపట్ల, గనపవరం, అడవి, అప్పి కట్ల, మరుప్రోలువారిపాలెం, ఈతేరు, మురుకొండపాడులో మార్కెట్ విలువ పెంచారు. సిటీలో గజం భూమి విలువ రూ.2,100 నుంచి రూ.3,000కు సవరించారు. ఎకరా ధర రూ.5.25 లక్షల నుంచి రూ.7 లక్షలకు పెంచారు. మార్కెట్ లో విలువ తక్కువగా ఉండి, డాక్యుమెంట్స్ రిజిస్ట్రేషన్స్ ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాలపై ఫోకస్ పెట్టిన ప్రభుత్వం. . అలా ఉన్న ప్రాంతాలైన బాపట్ల, నరసరావు పేటల్లో ధరలను ముందుగానే పెంచింది. పెరిగిన ధరల వలన ప్రజలపైన భారం పడనుంది.
Also Read: సొంత పార్టీలోనే అసమ్మతి కుంపట్లు ఎదుర్కొంటున్న జగన్