https://oktelugu.com/

స్పెషల్ స్టోరీ : నేడు ఎన్టీఆర్ 25వ వర్ధంతి !

జాతీయస్థాయిలో తెలుగువారికి గుర్తింపు తెచ్చి, వారి ఆత్మగౌరవాన్ని పెంచిన టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు మరియు విశ్వ విఖ్యాత నట సార్వభౌమ ‘ఎన్టీఆర్ 25వ వర్ధంతి’ నేడు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని సీనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆ మహా నటుడిని గుర్తు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన వర్ధంతి వేడుకలను ఎన్టీఆర్ అభిమానులు టీడీపీ కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్నారు. Also Read: ఎన్టీఆర్.. తెలుగు జాతి ఖ్యాతిని నలుచెరుగులా చాటిన ‘తారక’రాముడు ఇక తెలుగుజాతి వాడిని, […]

Written By:
  • Neelambaram
  • , Updated On : January 18, 2021 / 11:00 AM IST
    Follow us on


    జాతీయస్థాయిలో తెలుగువారికి గుర్తింపు తెచ్చి, వారి ఆత్మగౌరవాన్ని పెంచిన టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు మరియు విశ్వ విఖ్యాత నట సార్వభౌమ ‘ఎన్టీఆర్ 25వ వర్ధంతి’ నేడు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని సీనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆ మహా నటుడిని గుర్తు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన వర్ధంతి వేడుకలను ఎన్టీఆర్ అభిమానులు టీడీపీ కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్నారు.

    Also Read: ఎన్టీఆర్.. తెలుగు జాతి ఖ్యాతిని నలుచెరుగులా చాటిన ‘తారక’రాముడు

    ఇక తెలుగుజాతి వాడిని, వేడిని, పౌరుషాన్ని, తెగువని ప్రపంచపు నలుమూలలా చాటిచెప్పి.. కులం, మతం, ప్రాంతం మరియూ రాజకీయ పార్టీలకు అతీతంగా అభిమానుల్ని సంపాదించుకున్న ఘనత ఒక్క ‘ఎన్‌.టి.ఆర్‌’కే సాధ్యం అయింది. ఇక ఆయన జ్ఞాపకార్ధం, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఏవైనా రెండు జిల్లాలకి ‘ఎన్‌. టి. ఆర్‌. జిల్లా’ పేరుతో నామకరణం జరపాలనీ..
    ఆయన్ని ‘భారతరత్న’ బిరుదాంకితుడిగా చూడాలన్న తెలుగువాళ్ళ చిరకాల స్వప్నం సాకారం చేయాలనీ..
    ప్రపంచవ్యాప్తంగా నివసిస్తున్న అసంఖ్యాక తెలుగు వారందరూ బలంగా కోరుకుంటున్నారు.

    ఇక ఎన్టీఆర్ నటన గురించి కొత్తగా చెప్పుకునేది ఏమి లేదు. పౌరాణిక పాత్రలు శ్రీ కృష్ణుడు, శ్రీ రాముడు, దుర్యోధనుడు, భీష్ముడు, భీముడు, రావణాసురుడు ఇత్యాదులెన్నో అసమాన రీతిలో పోషించి పండిత పామరుల గుండెలలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్న మహానటుడు ఆయన. అలాగే ఎన్నో అద్భుతమైన సోషల్ పిక్చర్స్ లో కూడా ఆయన నటన అద్భుతం.

    Also Read: ప్రముఖ సీనియర్ నిర్మాత మృతి !

    కాగా 1923 మే 23న కృష్ణా జిల్లాలోని నిమ్మకూరు గ్రామంలో చిన్న వ్యవసాయ కుటుంబంలో ఎన్టీఆర్ గారు జన్మించారు. ఆయన 320 కి పైగా చిత్రాల్లో నటించారు. 1949 లో ‘మనదేశం’ చిత్రంతో చలనచిత్ర రంగ ప్రవేశం చేసి వైవిధ్యవంతమైన పాత్రలు పోషించి తెలుగువారి అభిమానాన్ని చూరగొన్నారు. ఇప్పటికి ‘నటరత్న’ గా మన్ననలు పొందుతూ తెలుగు జాతి ఉన్నంత కాలం చిరస్థాయిగా నిలిచిపోనున్నారు.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

    ఇక ఈ జనరేషన్ లో సీనియర్ ఎన్టీఆర్ గారి సినిమాలు పెద్దగా ఎవరికీ తెలియకపోవచ్చు. అందుకే ఆయన నటించిన కొన్ని గొప్ప సినిమాలలో ‘పాతాల భైరవి’, ‘మిస్సమ్మ’, ‘మాయా బజార్’, ‘గుండమ్మ కథ’, ‘రాముడు భీముడు’, దాన వీర శూర కర్ణ’, ‘బొబ్బిలి పులి’, ‘వేటగాడు’ ఇవే కాక ఇంకా చాలా బ్లాక్ బస్టర్ హిట్స్ లో ఆయన నటించారు. పై సినిమాలను ఒకసారి చూసినా ఎన్టీఆర్ గారి గొప్పతనం ఈ జనరేషన్ కి అర్ధం అవుతుంది.