AP Special Status: ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం రాజకీయాలు ప్రత్యేక హోదాపైనే తిరుగుతున్నాయి. కేంద్రం ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని అంశాలకు న్యాయం చేయాలని భావిస్తున్న తరుణంలో ప్రత్యేక హోదా హాట్ టాపిక్ గా మారిపోయింది. కేంద్రం చర్చించే అంశాల్లో ప్రత్యేక హోదాను పక్కన పెట్టడం విమర్శలకు తావిస్తోంది ఇన్నాళ్లు ప్రత్యేక హోదా కోసమే పార్టీలు పోరాడితే కేంద్రం మాత్రం దాన్ని పట్టించుకోకపోవడంతోనే చర్చనీయాంశం అవుతోంది దీనికి ప్రతిపక్షాలను టార్గెట్ చేసుకుని వైసీపీ విమర్శలు చేయడం కూడా వివాదం అవుతోంది.
మొదటి నుంచి ఆంధ్రప్రదేశ్ కు విభజన సందర్భంగా ఇచ్చిన హామీలు అమలు చేయాలని పోరాటం చేస్తున్నా కేంద్రం పట్టించుకోలేదు. ఇప్పుడు ఈనెల 17న ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని అంశాల్లో తొమ్మిదింటిపై చర్చ జరుపుతుందని మొదట్లో ప్రచారం జరగగా చివరకు ప్రత్యేక హోదా పక్కన పెట్టినట్లు తెలియడంతో అన్ని పార్టీల్లో అలజడి రేగుతోంది.
దీనిపై వైసీపీ టీడీపీని నిందిస్తోంది. చివరి క్షణంలో టీడీపీనే పక్కన పెట్టించిందని ఆరోపణలు చేయడంతో వివాదం పెరుగుతోంది. దీనికి టీడీపీ కూడా కౌంటర్ ఇస్తోంది. మాకు అంత పలుకుబడి ఉంటే ఎప్పుడో జగన్ ను అక్రమాస్తుల కేసులో జైలులో పెట్టించేవారమని చెబుతున్నారు. ప్రత్యేక హోదా అంశం ఇప్పుడు పార్టీల్లో ఆరోపణలకు కేంద్ర బిందువుగా మారింది.
Also Read: కాపు రిజర్వేషన్లపై ప్రభుత్వానికి బీజేపీ డెడ్ లైన్
కేంద్రం తీసుకున్న నిర్ణయంతో పార్టీలు కొట్టుకునే వరకు వెళ్తున్నాయి. మీరంటే మీరే కారణమని ఒకరిపై మరొకరు బురద జల్లుకుంటున్నారు. దీంతో కేంద్రం ఏ మేరకు చర్యలు తీసుకుంటుందో తెలియడం లేదు. ఈ నేపథ్యంలో విభజన చట్టంలోని అన్ని అంశాలను చర్చించి ఏపీకి న్యాయం చేయాలని సీఎం జగన్ ఎన్నో మార్లు కోరినా కేంద్రం పెడచెవిన పెట్టింది. కానీ ఇప్పుడు మాత్రం దీనిపై చర్చించేందుకు ముందుకు రావడంతో అందరిలో ఆశలు పెరిగాయి.
ఇప్పుడు ప్రత్యేక హోదా ఉంటేనే ఏపీకి లాభం కలుగుతుందని భావించి అది లేనిదే మాకు ఏది అవసరం లేదని జగన్ తెగేసి చెప్పాలని పలువురు కోరుతున్నారు. కానీ జగన్ అంత ధైర్యం చేసి కేంద్రంతో అమీతుమీకి సిద్ధం అవుతారా అనేది ప్రశ్నార్థకం. కేంద్రం ఇచ్చిందే తీసుకుంటే పోలేదా అనే అభిప్రాయాలు కొందరిలో వస్తున్నాయని తెలుస్తోంది.