BJP War With KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బీజేపీతో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. దీంతో బీజేపీని టార్గెట్ చేసుకుని టీఆర్ఎస్ నేతలు రెచ్చిపోతున్నారు బీజేపీ అవినీతికి పాల్పడుతోందని విమర్శలకు దిగుతున్నారు. తమ వద్ద ఆధారాలున్నాయని చెబుతూ బీజేపీని ఇరుకున పెట్టాలని చూస్తోంది. దీనికి బీజేపీ కూడా గట్టిగానే స్పందిస్తోంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి టీఆర్ఎస్ పై ఘాటుగానే వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ పార్టీ మాతో కయ్యానికి దిగితే తాము కూడా రెడీయే అని సవాలు విసిరారు.
ఎవరిపై కూడా ఆధారపడి ఉండటం లేదని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కేసీఆర్ విలేకరుల సమావేశంలో బీజేపీతో ఢిల్లీలో తేల్చుకుంటామని చెప్పడంతో బీజేపీ కూడా ఘాటుగానే స్పందిస్తోంది. కేసీఆర్ తో ఏం కాదని తెలుస్తోంది. రాష్ట్రంలో పరిస్థితులు చక్కదిద్దుకోవడానికి ప్రాధాన్యం ఇవ్వకుండా కూట్లె రాయి ఏరనోడు ఏట్లో రాయి ఏరినట్లు కేసీఆర్ ప్రవర్తన ఉందని విమర్శలు చేస్తున్నారు.
Also Read: KCR and BJP: బీజేపీతో ఢిల్లీలోనే కేసీఆర్ తేల్చుకోబోతున్నారా?
ఇంట గెలిచి రచ్చ గెలవాలని తెలిసినా ప్రస్తుతం ఇల్లే కరెక్టుగా లేకున్నా రచ్చ మాత్రం ఏదో చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రానికి ఏం చేయని సీఎం దేశానికి ఏం చేస్తారో తెలియం లేదు.దీంతో కేసీఆర్ ఢిల్లీలో చక్రం తిప్పుతానని ప్రగల్భాలు పలకడం ఆయన అమాకత్వానికి నిదర్శనమే. ఇన్నాళ్లు బీజేపీని టార్గెట్ చేసుకున్నా ఏ ప్రభావం చూపని కేసీఆర్ ఇప్పుడు ఏదో చేస్తానిన చెప్పడంతో బీజేపీ నేతలు కూడా నవ్వుకుంటున్నారు.
కేసీఆర్ ఇలా వింతగా ప్రవర్తించడం వెనుక ఎవరున్నారనే అనుమానాలు కూడా వస్తున్నాయి. ఇప్పటికి సాధారణంగా ఉన్నా కేసీఆర్ దూకుడు పెంచుతానని చెప్పడంతో ఏం చేసుకుంటారో చేసుకోవాలని బీజేపీ నేతలు కూడా పరోక్షంగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దీంతో రెండు పార్టీల్లో నెలకొన్ని అభిప్రాయ భేదాల ఎక్కడికి వెళతాయో తెలియడం లేదు. ఈ క్రమంలో రాబోయే రోజుల్లో రెండు పార్టీలు ప్రత్యక్ష దాడులకు కూడా తెగబడే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి.
Also Read: Kcr vs Modi: కేసీఆర్ లో నిజంగానే భయం పట్టుకుందా?