Speaking English : ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లీష్ భాషకు ఎలాంటి ప్రాధాన్యత ఏర్పడిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఐటీ జాబ్(IT Job) చేయాలన్నా.. జీవితంలో పెద్ద పొజిషన్ కు వెళ్లాలంటే కచ్చితంగా ఇంగ్లీష్ భాష అవసరం ఎంతైనా ఉంది. ప్రపంచలో వేరే దేశంలో పని చేయాలన్నా.. లేదా ఎక్కడికైనా ప్రయాణించడానికి ఇంగ్లీష్ ప్రధాన భాషగా మారింది. భారతదేశంలో కూడా హిందీ, సంస్కృతం కాకుండా ఇంగ్లీషుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే ఏయే దేశాల్లో ఇంగ్లీషు ఎక్కువగా మాట్లాడతారో తెలుసా.. ఈ విషయంలో భారతదేశం ర్యాంక్ ఎక్కడ ఉందో తెలుసా? ఈ రోజు దాని గురించి తెలుసుకుందాం.
ఇంగ్లీష్ మాట్లాడటంలో అగ్రస్థానంలో ఢిల్లీ
ఈ రోజుల్లో ఇంగ్లీష్ ఒక ముఖ్యమైన భాషగా మారింది. ఇంగ్లీష్(English) మాట్లాడే పరంగా భారతదేశం(India) ప్రపంచ సగటు కంటే ఎక్కువగా ఉంది. కాగా, ఈ విషయంలో భారత్‌లో ఢిల్లీ ముందంజలో ఉంది. ఇది మేం చెబుతున్నది కాదు నివేదిక చెబుతున్నది. పియర్సన్ గ్లోబల్ ఇంగ్లీషు ప్రావీణ్యత నివేదిక ప్రకారం… ఢిల్లీలో ఇంగ్లీష్ మాట్లాడేవారు ఎక్కువగా ఉన్నారు. దాని తర్వాత రాజస్థాన్, పంజాబ్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఈ నివేదిక ప్రకారం, ఇంగ్లిష్ మాట్లాడే విషయంలో ఢిల్లీకి 63 మార్కులు వచ్చాయి.. ఇది దేశంలోనే అత్యధికం. ఆ తర్వాత రాజస్థాన్(Rajastan )కు 60 పాయింట్లు, పంజాబ్‌కు 58 పాయింట్లు వచ్చాయి.
ఇంగ్లీష్ మాట్లాడే విషయంలో అగ్రస్థానంలో ఉన్న దేశం
బ్రిటన్‌లో గరిష్టంగా 98.3 శాతం మందికి ఇంగ్లీషు బాగా ఎలా మాట్లాడాలో తెలుసు. అమెరికా(Americ)లో 95 శాతం మందికి ఇంగ్లిష్ ఎలా మాట్లాడాలో తెలుసు. వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ నుండి వచ్చిన డేటా ప్రకారం, చాలా మంది ప్రజలు జిబ్రాల్టర్‌లో ఇంగ్లీష్ మాట్లాడతారు. ఇక్కడ 100 శాతం మంది ప్రజలు అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడతారు. ఇక్కడ జనాభా 32,669 మాత్రమే.
భారతదేశంలో ఎంత మంది ఇంగ్లీష్ మాట్లాడతారు?
భారతదేశంలో 20 శాతం మంది ప్రజలు ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడగలరు. కానీ జనాభా పరంగా చూస్తే, భారతదేశంలో ఇంగ్లీష్ మాట్లాడే వారి సంఖ్య ప్రపంచంలోని టాప్ 5 దేశాలలో ఉంది. పియర్సన్ గ్లోబల్ ఇంగ్లీషు ప్రొఫిషియన్సీ రిపోర్ట్ ప్రకారం.. భారతదేశంలో ఇంగ్లీష్ మాట్లాడేవారిలో రాజధాని ఢిల్లీ(Delhi) ముందంజలో ఉంది.
ఈ దేశంలో అతి తక్కువ మంది ఇంగ్లీషు మాట్లాడుతారు
ఇంగ్లీషు మాట్లాడే అతి తక్కువ మంది ఏ దేశంలో ఉన్నారనేది ఇప్పుడు ప్రశ్న. చైనా(China)లో ఇంగ్లీష్ చాలా తక్కువగా ఉపయోగించబడుతుంది. ఇక్కడ 0.9 శాతం మంది మాత్రమే ఇంగ్లీషులో మాట్లాడతారు. చైనీస్ ప్రజలు వారి స్వంత భాషను ఎక్కువగా ఉపయోగిస్తారు. చైనాలో చైనీస్, మంగోలియన్, టిబెటన్, ఉయ్ఘర్ , జువాంగ్ మాట్లాడుతారు.