https://oktelugu.com/

Aishwarya Rajesh : ఐశ్వర్య రాజేష్ కి పెద్దగా ఆఫర్స్ రాకపోవడానికి కారణం ఏంటి..?

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ కెరియర్ అనేది చాలా తక్కువ కాలం పాటు ఉంటుందనే విషయం మనందరికి తెలిసిందే. ఇక హీరోలు ఎక్కువ సినిమాలు చేసి సక్సెస్ వచ్చిన ఫెయిల్యూర్స్ వచ్చిన వాళ్ళ మార్కెట్ అనేది తగిపోదు...

Written By:
  • Gopi
  • , Updated On : January 8, 2025 / 12:41 PM IST

    Aishwarya Rajesh

    Follow us on

    Aishwarya Rajesh : సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ కెరియర్ అనేది చాలా తక్కువ కాలం పాటు ఉంటుందనే విషయం మనందరికి తెలిసిందే. ఇక హీరోలు ఎక్కువ సినిమాలు చేసి సక్సెస్ వచ్చిన ఫెయిల్యూర్స్ వచ్చిన వాళ్ళ మార్కెట్ అనేది తగిపోదు…ఇక ఒకటి రెండు ప్లాపులు వచ్చాయి అంటే చాలు వాళ్ళ మార్కెట్ పూర్తిగా డౌన్ అయిపోవడమే కాకుండా ఇండస్ట్రీ నుంచి ఫెయిడ్ అవుట్ అయిపోయే పరిస్థితి కూడా ఏర్పడవచ్చు…

    తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటీ నటులకు టాలెంట్ ఉన్నప్పటికి వాళ్లకు సరైన అవకాశాలైతే రావు. ఇక ఏది ఏమైనా కూడా వాళ్ళు చేసే సినిమాల వల్ల వాళ్లకు పెద్దగా గుర్తింపు కూడా రాదు. మరి ఇలాంటి సందర్భంలోనే ఐశ్వర్య రాజేష్ లాంటి హీరోయిన్ మంచి నటిగా గుర్తింపు సంపాదించుకుంది. ఇక ఐశర్య రాజేష్ కి మంచి టాలెంట్ ఉన్నప్పటికి ఆమెకు హీరోయిన్ గా గుర్తింపు రావడం లేదు. వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే సినిమాలో హీరోయిన్ గా అవకాశం అయితే వచ్చింది. మరి ఈ సినిమాలో ఆమె నటన చాలా అద్భుతంగా ఉండబోతుంది అంటూ అనిల్ రావిపూడి లాంటి దర్శకుడు నుంచి ఒక కాంప్లిమెంట్ అయితే వచ్చింది. మరి ఆ కాంప్లిమెంట్ ని నెరవేరుస్తూ ఆమె ఈ సినిమాలో నటించి మెప్పించడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమా సక్సెస్ లో ఆమె కూడా చాలా కీలక పాత్ర వహించబోతుందనే వార్తలైతే వినిపిస్తున్నాయి. ఇక మీదట నుంచి ఆమెకు చాలా మంచి ఆఫర్లు రాబోతున్నాయని కూడా కొన్ని వార్తలైతే వస్తున్నాయి. ఇక ఇప్పటికి ఆమె రెండు సినిమాలకు సైన్ చేసిందనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇక ఇప్పటికే ఆమె కెరియర్ లో విజయ్ దేవరకొండ లాంటి స్టార్ హీరోతో ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమాలో నటించినప్పటికి ఆమె కెరియర్ అనేది పెద్దగా గ్రోత్ అయితే లేకుండా పోయింది.

    మరి ఎట్టకేలకు ఆమె కెరియర్ ఎలా బిల్డ్ అవ్వబోతుందనేది తెలియాల్సి ఉంది… మరి ఏది ఏమైనా వెంకటేష్ హీరోగా వస్తున్న ఈ సినిమా సూపర్ సక్సెస్ అయి యావత్ ఫ్యామిలీ ఆడియన్స్ ను మెప్పించే విధంగానే కనిపిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ ని చూస్తే చాలా కామెడీగా ఉండడమే కాకుండా ఫ్యామిలీ ఆడియెన్స్ ను కూడా ఎంటర్ టైన్ చేసే విధంగా ఉంది.

    కాబట్టి ఈ సినిమా సూపర్ సక్సెస్ అవుతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. మరి ఏది ఏమైనా వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఇంపాక్ట్ ను క్రియేట్ చేసుకోవాలంటే మాత్రం ఈ సినిమాలో తనదైన నటన ప్రతిభను కనబరచాల్సిన అవసరమైతే ఉంది. ఇక ఇప్పుడు చూస్తుంటే ఐశ్వర్య రాజేష్ వెంకటేష్ భార్యగా చాలా మంచి గుర్తింపును సంపాదించుకోవడానికి ఆసక్తి కనబరిచినట్టుగా తెలుస్తోంది.

    అలాగే ఒకప్పుడు సీనియర్ హీరోయిన్ అయిన సౌందర్య మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఇక వెంకటేష్ సౌందర్య కాంబినేషన్ మంచి కెమిస్ట్రీ అయితే ఉండేది. ఇక ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య కూడా అలాంటి కెమిస్ట్రీ కుదిరిందని దర్శకుడు అనిల్ రావిపూడి రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో తెలియజేయడం విశేషం…