South West Monsoons: ఇలా వచ్చిన వరద నీటి ద్వారా పంటలు పండుతాయి. తద్వారా దేశం సుభిక్షంగా ఉంటుంది. వాస్తవానికి జూన్ నెలలో నైరుతి రుతుపవనాలు దేశంలోకి వస్తుంటాయి. కానీ ఈసారి మే 21 న నైరుతి రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించాయి. వీటికంటే ముందు మే 13న దక్షిణ అండమాన్, పరిసర ప్రాంతాల్లోని సముద్ర ఉపరితలంలోకి రుతుపవనాలు ప్రవేశించాయి.. వాస్తవానికి ఈ ప్రక్రియ మే 21న మొదలవుతుంది. కానీ ఈసారి ఎనిమిది రోజుల ముందుగానే ఇది జరిగింది. ఆ రుతుపవనాలు 21న దేశంలోకి ప్రవేశించడంతో అవి కేరళ వైపు ప్రయాణం సాగించాయి. వాతావరణం కూడా అనుకూలంగా ఉండడంతో కేరళలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీనికి తగ్గట్టుగా పసిఫిక్ సముద్రంపై “తటస్థ ఎల్ నీనో – దక్షిణ ఆసిలేషన్” పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇవి రుతుపవనాలు అత్యంత అనుకూలంగా ఉంటాయి..
గత కొంతకాలంగా ఎల్ నీనో వల్ల భారత దేశంలో వర్షపాతాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. హిమాలయాలలో చోటు చేసుకునే హిమపాతం కూడా వర్షపాతాన్ని ప్రభావితం చేసింది. సరిగ్గా 16 సంవత్సరాల క్రితం ఇలాగే రుతుపవనాలు మన దేశాన్ని గడుపు కంటే ముందుగానే తాకాయి. నాడు మే 23న రుతుపవనాలు దేశంలో ప్రవేశించాయి. అప్పుడు దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిశాయి. ” ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు ఆధారంగా ఈశాన్య రుతుపవనాల పనితీరు ఉంటుందని చెప్పలేం. నైరుతి రుతుపవనాల పురోగతి ఆధారంగానే వాటి పనితీరు కూడా ఉంటుందని” వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు..”సాధారణంగా నైరుతి రుతుపవనాలు జూన్ 1 న మొదలవుతాయి. ఈ సంవత్సరం 24నే మొదలయ్యాయి. గత 16 సంవత్సరాల రికార్డులను పరిశీలిస్తే.. 2009లో రుతుపవనాలు మే 23న దేశంలోకి ప్రవేశించాయని” వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
నైరుతి రుతుపవనాల ప్రభావం వల్ల దక్షిణ కొంకణ్ తీరంలో అల్పపీడనం ఏర్పడింది. అది తూర్పు వైపు కదులుతోంది. రాబోయే 12 గంటల్లో అది అల్పపీడనంగా మారే అవకాశం ఉందని తెలుస్తోంది. ఫలితంగా వచ్చే రోజుల్లో కేరళ రాష్ట్రంలోని పల్లి జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. రుతుపవనాలు కేవలం కేరళ రాష్ట్రాన్ని మాత్రమే కాకుండా లక్షద్వీప్, దక్షిణ అరేబియా సముద్రం, పశ్చిమ – మధ్య, తూర్పు మధ్య అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలు, కర్ణాటక, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించాయి. తమిళనాడులోని అనేక ప్రాంతాలు, నైరుతి, తూర్పు – మధ్య బంగాళాఖాతం, మిజోరం, ఉత్తర బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించాయి.
” ఈసారి పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితలంపై వేడి అంతగా లేదు. ఎల్ నీనో ప్రభావం కూడా అంతగా కనిపించడం లేదు. అందువల్లే వాతావరణం అనుకూలంగా ఉంది. ఈసారి విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఊహించిన దానికంటే ఎక్కువ వర్షపాతం నమోదయింది. ఉత్తర, దక్షిణ అని తేడా లేకుండా అన్ని ప్రాంతాలలో ఒకే తీరుగా వర్షాలు కురవడం ఈసారి కాస్త రైతులకు ఆనందం కలిగించే విషయమని” వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.