ప్రస్తుతం పాకిస్తాన్ బోర్డు (పీసీబీ)చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉందనే చెప్పాలి. ఎందుకంటే బీసీసీఐ దెబ్బకి పాకిస్థాన్ బోర్డ్ దగ్గర మ్యాచులు నిర్వహించడానికి కావాల్సిన డబ్బులు కూడా లేకుండా అయిపోయింది. దానికి కారణం ఏంటి అంటే ఈ సంవత్సరం జరిగిన ‘ఆసియా కప్ 2023 ‘ ను మొదటగా పాకిస్తాన్ నిర్వహించింది. ఇక దాంతో బీసీసీఐ పాకిస్తాన్ లో అయితే ఇండియా మ్యాచ్ లను ఆడదు అని తెగేసి చెప్పడంతో, కేవలం ఇండియా కోసం ‘హైబ్రిడ్ మోడ్’ లో మ్యాచ్ లను నిర్వహించారు.
అంటే కొన్ని మ్యాచ్ లను పాకిస్తాన్ లో మరికొన్ని మ్యాచ్ లను శ్రీలంకలో నిర్వహించాల్సి వచ్చింది. అయితే ఇండియా ఆడే మొత్తం మ్యాచ్ లను శ్రీలంకలోనే నిర్వహించారు.
దీనివల్ల ఖర్చులు భారీగా అవుతాయి. కాబట్టి ఇప్పుడు పాకిస్తాన్ బోర్డు ఆ ఖర్చులను భరించలేక పోతుంది. దానివల్ల సహా హోస్టుగా వ్యవహరించినందుకు శ్రీలంక కూడా కొన్ని ఖర్చులను భరించాలని పాకిస్థాన్ బోర్డు కోరుతుంది. కానీ దానికి మాత్రం శ్రీలంక బోర్డు నిరాకరిస్తుంది.
ఇక ఒక దేశం నుంచి మరొక దేశానికి ప్లేయర్లు వెళ్లడానికి చార్టెడ్ ఫ్లైట్స్ , వాళ్ళు ఉండడానికి కావాల్సిన హోటల్స్ మిగతా అన్ని ఖర్చులు కలిపి ఇప్పుడు భారీగా అవడంతో పాకిస్తాన్ వాటిని భరించలేక పోతుంది. దానివల్లే శ్రీలంక సహ హోస్ట్ గా వ్యవహరిస్తే రెండు కలిసి ఆ ఖర్చులను బరించాల్సి ఉంటుంది. కానీ శ్రీలంక మాత్రం దానికి నిరాకరిస్తుంది. ఎందుకంటే ఇండియా పాకిస్తాన్ రానందు వల్ల ఇండియా మ్యాచ్ లు మా దేశం లో నిర్వహించాల్సి వచ్చింది. ఇక దానివల్ల మీరు పెట్టిన ఖర్చును మేమెందుకు భరిస్తాం అంటూ శ్రీలంక బోర్డు తెగేసి చెబుతుంది…ఇక ఇదిలా ఉంటే ఆషియన్ క్రికెట్ కౌన్సిల్ బోర్డ్ అధ్యక్షుడు అయిన ‘జై షా’ మాత్రం పాకిస్తాన్ శ్రీలంకని సాహ హోస్ట్ గా వాడుకున్నందుకు పాకిస్తాన్ బోర్డు శ్రీలంక బోర్డుకి డబ్బులు చెల్లించాలి అంటూ కామెంట్లు చేశాడు…
ఇక ఇదంతా గమనిస్తుంటే ఇండియా పాకిస్తాన్ లో మ్యాచ్ లు ఆడనందువల్ల పాకిస్తాన్ భారీగా నష్టపోయింది. కనీసం మ్యాచ్ లను కూడా నిర్వహించే స్థోమత లేని పాక్ బోర్డ్ మేము ఇండియా కంటే తోపులం అని ఫీల్ అయిపోతూ ఉంటుంది. కనీసం ఇప్పటికైనా కళ్ళు తెరిచి వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుంటే మంచిది. ప్రతిదానికి మేము ఇండియా కంటే తోపులం అంటే ఇలాగే బొక్క బోర్ల పడాల్సి వస్తుందంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు…