బీజేపీ, జనసేన పొత్తుపై తిరుపతిలో సంచలన ప్రకటన చేసిన సోము వీర్రాజు

తిరుపతి ఉప ఎన్నికపై బీజేపీ, జనసేన మధ్య కొద్దిరోజులుగా అభ్యర్థి కోసం నలుగురు ఫైట్ పై ఎట్టకేలకు బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు స్పందించారు. తిరుపతిలో నూతన బీజేపీకార్యాలయాలన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. Also Read: తాడిపత్రిలో రణరంగం: జేసీ ఇంటిపై వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి దాడి? ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ.. ‘తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ, జనసేన కలిసే పోటీచేస్తాయని స్పష్టం చేశారు. అంతేకాదు.. అభ్యర్థి ఎవరనేది తొందరలోనే […]

Written By: NARESH, Updated On : December 24, 2020 5:02 pm
Follow us on

తిరుపతి ఉప ఎన్నికపై బీజేపీ, జనసేన మధ్య కొద్దిరోజులుగా అభ్యర్థి కోసం నలుగురు ఫైట్ పై ఎట్టకేలకు బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు స్పందించారు. తిరుపతిలో నూతన బీజేపీకార్యాలయాలన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

Also Read: తాడిపత్రిలో రణరంగం: జేసీ ఇంటిపై వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి దాడి?

ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ.. ‘తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ, జనసేన కలిసే పోటీచేస్తాయని స్పష్టం చేశారు. అంతేకాదు.. అభ్యర్థి ఎవరనేది తొందరలోనే హైకమాండ్ వేసిన కమిటీ డిసైడ్ చేస్తుందని.. ఎవరైనా బీజేపీ, జనసేన కలిసే ఈ ఎన్నికల్లో సాగుతుందని సోము వీర్రాజు ఊహాగానాలకు తెరదించారు.

తిరుపతి ఎంపీ టికెట్ కోసం జనసేనాని పవన్ ప్రయత్నిస్తున్నాడని.. మళ్లీ ఢిల్లీ బాట పట్టాడని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో త్యాగం చేసి బీజేపీకి సపోర్ట్ చేసిన పవన్ తిరుపతి ఎంపీ సీటు కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. టికెట్ ఇవ్వకపోతే ఒంటరిగా పోటీకి దిగబోతున్నట్టు ప్రచారం సాగింది.

Also Read: ఇంజినీరింగ్‌ కాలేజీలకు జగన్‌ సర్కార్‌‌ షాక్‌

అయితే ఈ ప్రచారాలను సోము వీర్రాజు కొట్టిపారేశారు. బీజేపీ, జనసేన కలిసే తిరుపతిలో పోటీచేస్తాయని.. ఉమ్మడి అభ్యర్థి బరిలోకి దిగుతాడని క్లారిటీ ఇచ్చారు. మా ప్రత్యర్థులు వైసీపీ, టీడీపీ అని స్పష్టం చేశారు.

*సోము వీర్రాజు తిరుపతిలో పొత్తుపై మాట్లాడిన వీడియోను కింద చూడొచ్చు.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్