https://oktelugu.com/

Rajini kanth: పెద్దన్న సినిమాతో కలసి నిర్మిస్తాం అంటున్న నిర్మాత డి. సురేష్‌బాబు…

Rajini kanth: సినిమా ఇండస్ట్రీలో  చిత్రాలు నిర్మించాలంటే భారీ వ్యయంతో కూడుకున్న పని. ఒకసారి బడ్జెట్ అనుకున్న దాని కన్నా ఎక్కువ కావచ్చు…  తక్కువ కూడా కావచ్చు. వాటన్నిటినీ తట్టుకొని నిలబడిన సక్సెస్ ఫుల్ అయినా వారిలో అల్లు అరవింద్, దిల్‌రాజు, సురేష్‌బాబు… నారాయణ దాస్‌ నారంగ్‌, శోబు యార్లగడ్డ తదితరులు ఉంటారు. అయితే ఇటీవలే తెరకెక్కుతున్న చిత్రాలన్ని పాన్ ఇండియా లెవల్లో నిర్మిస్తున్నారు. ఇటీవల నిర్మాత డి. సురేష్‌బాబు, నారాయణ్‌ దాస్‌ నారంగ్‌తో కలసి మీడియాతో […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : November 1, 2021 / 06:13 PM IST
    Follow us on

    Rajini kanth: సినిమా ఇండస్ట్రీలో  చిత్రాలు నిర్మించాలంటే భారీ వ్యయంతో కూడుకున్న పని. ఒకసారి బడ్జెట్ అనుకున్న దాని కన్నా ఎక్కువ కావచ్చు…  తక్కువ కూడా కావచ్చు. వాటన్నిటినీ తట్టుకొని నిలబడిన సక్సెస్ ఫుల్ అయినా వారిలో అల్లు అరవింద్, దిల్‌రాజు, సురేష్‌బాబు… నారాయణ దాస్‌ నారంగ్‌, శోబు యార్లగడ్డ తదితరులు ఉంటారు. అయితే ఇటీవలే తెరకెక్కుతున్న చిత్రాలన్ని పాన్ ఇండియా లెవల్లో నిర్మిస్తున్నారు. ఇటీవల నిర్మాత డి. సురేష్‌బాబు, నారాయణ్‌ దాస్‌ నారంగ్‌తో కలసి మీడియాతో ముచ్చటించారు.

    రజనీకాంత్‌ నయనతార జోడిగా తెరకెక్కిన ‘పెద్దన్న’ చిత్రం దీపావళి కానుకగా నవంబరు 4న విడుదలవుతోంది. ఇక నేనూ, దిల్‌రాజు,  నారాయణ దాస్‌ నారంగ్‌ కలసి సినిమాలు నిర్మిస్తాం. అందులోనే తొలి ప్రయత్నంగా మా కలయికలో రజనీకాంత్‌ నటించిన ‘అన్నాత్తే’ (పెద్దన్న)ను తెలుగులో విడుదల చేస్తున్నాం అని చెప్పుకొచ్చారు. కరోనా సంక్షోభం తర్వాత థియేటర్లలోకి సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయడం సంతోషంగా ఉందని సురేష్ బాబు అన్నారు.

    నారంగ్‌ మాట్లాడుతూ రజినీకాంత్ ‘‘పెద్దన్న’ చిత్రం దీపావళికి తెలుగు ప్రేక్షకులకు ఒక పండగ లాంటి వినోదం అందిస్తుంది అని చెప్పారు. శివ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాని… సన్ పిక్చర్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. నయనతార హీరోయిన్‌ గా నటిస్తుండగా… కీర్తి సురేష్ రజినీకాంత్ చెల్లెలి క్యారెక్టర్ లో కనిపించనుంది. ప్రముఖ హీరోయిన్లు మీనా, ఖుష్బూ కీలకపాత్రల్లో నటించారు. అలానే జగపతి బాబు, అభిమన్యు సింగ్, ప్రకాష్ రాజ్ఈ చిత్రంలో నెగెటివ్ రోల్స్ చేశారు. తెలుగులో ఈ సినిమా హక్కులను ఏషియన్ సినిమాస్… రూ. 12 కోట్లకు కొనుగోలు చేసినట్టు సమాచారం.