Somu Veerraju Viral Video: కడప జిల్లావాసులపై ఏపీ బీజేపీ స్టేట్ చీఫ్ సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలు ప్రజెంట్ పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చనీయాంశమవుతున్నాయి. ఆ వ్యాఖ్యాలు జిల్లాలో రాజకీయ దుమారానికి దారి తీస్తున్నాయి. వైసీపీ నేతలు, కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా ఆయనపైన నిప్పులు చెరుగుతున్నారు. సోమువీర్రాజును వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంతకీ సోము ఏం కామెంట్ చేశాడంటే..

ప్రతీ జిల్లాకు ఒక విమానాశ్రయం ఏర్పాటు చేయాలని, అందుకు సంబంధించిన ప్రతిపాదనలను రెడీ చేయాలని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల ప్రకటన చేసిన సంగతి అందరికీ తెలిసిందే. కాగా, సీఎం ప్రతిపాదనను సోమువీర్రాజు తప్పుబట్టారు. జగన్ ప్రకటనలకు మాత్రమే పరిమితమవుతారని, కార్యరూపంలోకి వచ్చేది శూన్యమేనని విమర్శించారు. ఏపీలో రోడ్లు వేయడానికి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, అటువంటిది విమానాశ్రయాలు ఎలా వస్తాయని ప్రశ్నించారు. విమానాశ్రయాలను కేటాయించేది, వాటిని అభివృద్ధి చేసేది కేంద్రంలో అధికారంలో ఉన్న తమ పార్టీ ప్రభుత్వమని ఈ సందర్భంగా సోము వీర్రాజు వ్యాఖ్యానించారు.
ఈ క్రమంలోనే సోము వీర్రాజు అభ్యంతర వ్యాఖ్యలు చేశారు. ప్రాణాలు తీసే కడపలో కూడా కేంద్రప్రభుత్వం విమానాశ్రయాన్ని మంజూరు చేసిందని అన్నారు. కడప వాళ్లకు ప్రాణాలు తీయడమే వచ్చని సంచలన వ్యాఖ్యలు చేశారు. విమానాశ్రయాల సంగతి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం చూసుకుంటుందని, మొదాలు రాష్ట్రంలోని రోడ్ల సంగతి రాష్ట్రసర్కారు చూడాలని ఈ సందర్భంగా జగన్ సర్కారుకు సోము సూచించారు.
కాగా, సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. కడప జిల్లాకు చెందిన బీజేపీ సీనియర్ నాయకులు, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, ఆది నారాయణ రెడ్డి సోము వ్యాఖ్యలపైన బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తోన్నారు. తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలను సీఎం రమేశ్ కాని, ఆది నారాయణ రెడ్డి కాని సమర్థిస్తారా? లేదా విమర్శిస్తారా? అనేది చూడాలి. అయితే, ఓ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి బాధ్యతారహితంగా సోము వీర్రాజు మాట్లాడారని వైసీపీ నేతలు చెప్తున్నారు. జిల్లా వాసులను హంతకులుగా చిత్రీకరించినట్లు మాట్లాడిన సోముపై చర్యలు తీసుకోవాలని వైసీపీ నేతలు కోరుతున్నారు.
Also Read: బ్యాడ్ లక్.. జగన్ నిర్ణయం రోజాకు మైనస్ కానుందా?

[…] […]