Bigg Boss Himaja: బిగ్ బాస్ ఫేమ్ హిమజ ఈ రోజు వార్తల్లో నిలిచింది. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను తెచ్చుకున్న హిమజ పర్సనల్ లైఫ్ కి సంబంధించి ఓ పుకారు నిన్నటి నుంచి బాగా హల్ చల్ చేసింది. హిమజకు గతంలోనే రెండుసార్లు పెళ్లైందని, రెండోసారి ఆమె విడాకులకు సిద్ధమైందని.. అందుకే తన భర్త విజయ్ చల్లా రెడ్డిని ఇన్‌స్టాలో అన్‌ఫాలో చేసిందని.. అతను కూడా హిమజను అన్ ఫాలో చేశాడని వార్తలు వినిపించాయి.

అయితే, వీరిద్దరికి పెళ్లి జరగకముందు 2012లోనే రాజేష్ ఆనందన్ అనే బిజినెస్ మెన్ తో హిమజకు పెళ్లైనట్టు కూడా పుకార్లు వినిపించాయి. ఇక ప్రస్తుతం హిమజ తన రెండో భర్త విజయ్ చల్లా రెడ్డికు కూడా విడాకులు ఇస్తుందని.. హిమజ, విజయ్ లు త్వరలో తమ బంధానికి ఫుల్ స్టాప్ పెట్టనున్నట్లు రాసుకొచ్చారు. అయితే, తాను విడాకులకు సిద్ధమైనట్లు వస్తున్న వార్తల పై ఈ బిగ్‌బాస్ బ్యూటీ స్పందించింది.
Also Read: ప్రభాస్ సినిమా పాన్ ఇండియా కాదు.. పాన్ వరల్డ్
హిమజ ఈ వార్తల పై మాట్లాడుతూ.. నా పెళ్లి, విడాకుల పై వచ్చిన వార్తలన్నీ ఫేక్ వార్తలని, మరో మూడేళ్ల వరకు పెళ్లి చేసుకునే ఆలోచన తనకు లేదని స్పష్టం చేసింది. ఇలాంటి ఫేక్ న్యూస్ ని తాను ఈజీగా తీసుకున్నప్పటికీ, తన ఇంట్లో వాళ్లు ఇబ్బంది పడతారని ఆమె చెప్పుకొచ్చింది. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన ఓ వీడియోలో ఇలా స్పందించింది.
మొత్తానికి తన పెళ్లి పై క్లారిటీ ఇచ్చింది బిగ్‌బాస్ ఫేమ్ హిమజ. ఇక హిమజ శివం, నేను శైలజ, జనతా గ్యారేజ్, చిత్రలహరి వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది.
