రాపాక మనసులో మాట ఇదే..!

జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ తన మనసులో మాట ఎట్టకేలకు బయట పెట్టారు. ఇన్నాళ్లు ఈ విషయం బయట పెట్టకుండా ఏవో సాకులు చెబుతూ తప్పించుకుంటున్న ఆయన ఎట్టకేలకు ఆసలు విషయాన్ని వెల్లడించారు. తాను వైసీపీ నుంచి పోటీ చేయాలనుకున్నానని అవకాశం రాకపోవడంతో జనసేన నుంచి పోటీ చేశానని వెల్లడించారు. తూర్పు గోదావరి జిల్లా రాజోలు నుంచి జనసేన పార్టీ తరుపున పోటీ చేసిన రాపాక వరప్రసాద్ గెలిచి, పార్టీకి ఏకైక ఎమ్మెల్యేగా ఉన్నారు. దీంతో జనసైనికులు […]

Written By: Neelambaram, Updated On : August 11, 2020 8:39 pm
Follow us on


జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ తన మనసులో మాట ఎట్టకేలకు బయట పెట్టారు. ఇన్నాళ్లు ఈ విషయం బయట పెట్టకుండా ఏవో సాకులు చెబుతూ తప్పించుకుంటున్న ఆయన ఎట్టకేలకు ఆసలు విషయాన్ని వెల్లడించారు. తాను వైసీపీ నుంచి పోటీ చేయాలనుకున్నానని అవకాశం రాకపోవడంతో జనసేన నుంచి పోటీ చేశానని వెల్లడించారు. తూర్పు గోదావరి జిల్లా రాజోలు నుంచి జనసేన పార్టీ తరుపున పోటీ చేసిన రాపాక వరప్రసాద్ గెలిచి, పార్టీకి ఏకైక ఎమ్మెల్యేగా ఉన్నారు. దీంతో జనసైనికులు ఆయనను ఒక హిరోగా భావించారు.

Also Read: ఏపీలో ప్రతిపక్షం ఖాళీ..!

అనంతరం ఈ పరిస్థితులు తారుమారు అయ్యాయి. వరప్రసాద్ క్రమంగా వైసీపీకి దగ్గరవుతూ జనసేనకు దూరమయ్యారు. వివిధ అంశాల్లో, ప్రజా సమస్యలపై ఆయన జనసేన వైఖరిని, విధానాన్ని ఆయన శాసనసభలో ఎప్పుడూ వినిపించలేదు. ఆ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేగా ఆయన ప్రసంగం ఎప్పుడూ కనిపించలేదు. ఇటీవల రాజ్యసభ ఎన్నికల్లో ఆయన వైసీపీ అభ్యర్ధికే ఓటు వేశారు. తనకు పార్టీ నుంచి ఎటువంటి సూచనలు రాలేదని, తన ఇష్ట ప్రకారం వైసీపీ అభ్యర్ధికే ఓటు వేశానని ఆయన బహిరంగంగానే ప్రకటించారు. ఇలా అనేక సందర్భాల్లో ఆయన వైసీపీకి మద్దతు పలికారు. దీంతో జనసైనికులు ఆయనపై సోషల్ మీడియాలోను విమర్శలు ఎక్కుపెట్టారు.

Also Read: బీజేపీ కరోనా వంటిది అయితే… వైసీపీ కి ఏ వ్యాధి పేరు పెట్టాలి నాని?

జనసేన విషయంలో రాపాక చేసిన వ్యాఖ్యలు జనసైనికులకు ఆగ్రహాన్ని తెప్పించాయి. తాను జనసేన పార్టీ అభ్యర్ధిగానే ఎన్నికల్లో విజయం సాధించానని ఇప్పడు ఆ పార్టీ ఉందో… లేదో తెలియదని వ్యాఖ్యానించారు. జనసేనపై ఇష్టం లేకపోయినా చాలా మంది ఓటర్లు తనను చూసే ఓటు వేశారంటూ వైసీపీ విషయంలో రాఘురామ కృష్ణంరాజు చెప్పినట్లుగా చెప్పుకొచ్చారు. ఇప్పుడు తాను వైసీపీ వైపే ఉన్నానని స్పష్టం చేశారు. దీంతో జనసేనకు ఉన్న ఎకైన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఇక ఆ పార్టీకి దూరమైనట్లే. దీని బట్టీ చూస్తే రాపాక తన అవసరానికి జనసేనను వాడుకున్నారనేది స్పష్టం అవుతుంది.