https://oktelugu.com/

సుశాంత్  రూ.12కోట్లు అడిగాడు.. ఎందుకంటే?

బాలీవుడ్ సుశాంత్ సింగ్ రాజ్ ఫుత్ ఆత్మహత్య కేసు బాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేస్తున్న సంగతి తెల్సిందే. పోలీసులు విచారణలో డ్రగ్స్ లింకులు బయటపడటంతో ఆ దిశ కేసు దర్యాప్తు సాగుతోంది. సీబీఐ, ఎన్సీబీ పోలీసులు రంగంలోకి దిగి పలు కీలక విషయాలను సేకరిస్తున్నారు. Also Read: నమ్రతను నేను గౌరవిస్తా..: బండ్ల గణేశ్‌ కామెంట్స్‌ ఇప్పటికే ఈ కేసులో పలు సంచనల విషయాలు వెలుగుచూశాయి. తాజాగా సుశాంత్ కు టాలెంట్ మేనేజర్ గా పనిచేసిన జయ […]

Written By:
  • NARESH
  • , Updated On : September 23, 2020 / 12:49 PM IST
    Follow us on


    బాలీవుడ్ సుశాంత్ సింగ్ రాజ్ ఫుత్ ఆత్మహత్య కేసు బాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేస్తున్న సంగతి తెల్సిందే. పోలీసులు విచారణలో డ్రగ్స్ లింకులు బయటపడటంతో ఆ దిశ కేసు దర్యాప్తు సాగుతోంది. సీబీఐ, ఎన్సీబీ పోలీసులు రంగంలోకి దిగి పలు కీలక విషయాలను సేకరిస్తున్నారు.

    Also Read: నమ్రతను నేను గౌరవిస్తా..: బండ్ల గణేశ్‌ కామెంట్స్‌

    ఇప్పటికే ఈ కేసులో పలు సంచనల విషయాలు వెలుగుచూశాయి. తాజాగా సుశాంత్ కు టాలెంట్ మేనేజర్ గా పనిచేసిన జయ సాహానిని ఎన్సీబీ పోలీసులు విచారించారు. సుశాంత్ కు సంబంధించిన పలు కీలక విషయాలను ఆమెకు పోలీసులకు వెల్లడించారు. జూన్ 5న తాను చివరిసారిగా సుశాంత్ సింగ్ ను ఓ సినిమా కోసం కలిసినట్లు జయ సాహాని తెలిపినట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి.

    2016 నుంచి జయ సాహాని సుశాంత్ టాలెంట్ మేనేజర్ గా ఆమె పనిచేస్తోంది. ఈక్రమంలో ‘సన్ చురియా’.. ‘కేదార్ నాథ్’.. ‘చొచ్చోరే’.. ‘డ్రైవ్’.. సినిమాలు సుశాంత్ వచ్చేలా చేసింది. సన్ చురియా సినిమా కోసం రూ.5కోట్లు.. కేదార్ నాథ్ కు రూ.6కోట్లు.. డ్రైవ్ కు రూ.2.25కోట్లు.. చొచ్చోరే కు రూ.5కోట్లు.. దిల్ బెచారాకు రూ.3.5కోట్లు సుశాంత్ పారితోషికం తీసుకున్నారని ఆమె పోలీసులకు తెలిపింది.

    వీటితోపాటు సుశాంత్ కు 21 బ్రాండ్స్ తో ఒప్పందం కుదిరేలా చేసినట్లు జయా సాహాని పోలీసులకు చెప్పినట్లు సమాచారం. ఇక గత డిసెంబరు నుంచే సుశాంత్ మానసికంగా కుంగుబాటుకు గురైనట్లు ఆమె వెల్లడించింది. ఈ ఏడాది మార్చిలో తాను సుశాంత్ ఇంటికి వెళ్లగా ఆయన ప్రవర్తన చూసి ఆశ్చర్యానికి గురైందట. ఆయన పలుమార్లు హాల్లో నుంచి బెడ్ రూమ్లోలోకి.. బెడ్ రూమ్ నుంచి హాల్లోకి పలుమార్లు తిరుగుతూ కన్పించాడట.

    Also Read: టాలీవుడ్ డ్రగ్స్ కేసు కనుమరుగైనట్టేనా?

    తాను చివరగా జూన్ 5న సుశాంత్ ను ఓ సినిమా కోసం కలిసినట్లు చెప్పింది. కుమార్ మంగళ్ తెరకెక్కిస్తున్న ఓ సినిమాకు సుశాంత్ మొదట రూ.6కోట్లకు ఒప్పుకున్నారట. అయితే ఆ తర్వాత రూ.12కోట్లు కావాలని అడిగారని చెప్పింది. ఆయన ఉన్నఫలంగా రెట్టింపు పారితోషికం ఎందుకు అడిగారో తెలియదని పోలీసులకు చెప్పింది. దీంతో ఈ విషయాలను తెలుసుకునేందుకు పోలీసులు మరింత మందిని విచారించేందుకు రెడీ అవుతున్నారు.