త్వరపడండి: శృంగారంతో 100 ఏళ్లు అంట!

వెనుకటికి మా తాత వందేళ్లు బతికాడంట అని గొప్పలు చెప్పుకుంటాం. కానీ మన వద్దకు వచ్చేటప్పటికీ 60 ఏళ్లకే ముసలోళ్లం అయిపోయి పళ్లు ఊడి జట్టు రాలి ఆయుష్షు తీరి చనిపోతున్నాం. మరి అప్పుడు వాళ్లు ఎలా బతికారంటే మంచి పౌష్టికాహారం తిని.. శరీరక శ్రమ చేసి బతికేశారు. ముఖ్యంగా శృంగారాన్ని తనివితీరా ఎంజాయ్ చేశారు. ఇప్పుడు మనకు ఇదే కొరవడి తొందరగా పైకి పోతున్నామని తాజా పరిశోధనల్లో తేలింది. ఇటీవల బ్రిటన్ కు చెందిన పరిశోధకులు […]

Written By: NARESH, Updated On : December 16, 2020 8:29 pm
Follow us on

వెనుకటికి మా తాత వందేళ్లు బతికాడంట అని గొప్పలు చెప్పుకుంటాం. కానీ మన వద్దకు వచ్చేటప్పటికీ 60 ఏళ్లకే ముసలోళ్లం అయిపోయి పళ్లు ఊడి జట్టు రాలి ఆయుష్షు తీరి చనిపోతున్నాం. మరి అప్పుడు వాళ్లు ఎలా బతికారంటే మంచి పౌష్టికాహారం తిని.. శరీరక శ్రమ చేసి బతికేశారు. ముఖ్యంగా శృంగారాన్ని తనివితీరా ఎంజాయ్ చేశారు. ఇప్పుడు మనకు ఇదే కొరవడి తొందరగా పైకి పోతున్నామని తాజా పరిశోధనల్లో తేలింది.

ఇటీవల బ్రిటన్ కు చెందిన పరిశోధకులు చేసిన రీసెర్చిలో ప్రతీరోజు శృంగారం చేసే వ్యక్తిలో రోగ నిరోధక శక్తి పెరిగి జలుబు, తలనొప్పి లాంటి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు సైతం దూరమవుతాయని తేలింది. అంతే కాదు తరచూ శృంగారం చేసే జంటల్లో ఆయుష్షు కూడా పెరుగుతుందని పరిశోధకులు చెబుతున్నారు.

లైంగిక సంబంధం మీ మెదడు కెమిస్ట్రీని అన్ని రకాలుగా మారుస్తుంది. శృంగారం వాస్తవానికి మరింత భావన సామర్థ్యాన్ని పెంచుతుంది. మీ విశ్లేషణాత్మక ఆలోచనా విధానం నైపుణ్యాలను పెంచుతుందని ఒక అధ్యయనం పేర్కొంది. మరొక అధ్యయనంలో లైంగికంగా చురుకైన వర్జిన్ ఎలుకలలో.. మామూలు ఎలుకల కంటే హిప్పోకాంపస్ (జ్ఞాపకశక్తితో ముడిపడి ఉన్న మెదడు ప్రాంతం)లో ఎక్కువ న్యూరాన్లు ఉన్నాయని సూచించింది. లైంగిక కార్యకలాపాలు ఆగిపోయిన తరువాత బ్రెయిన్ పవర్‌లో మెరుగుదల పోయాయని గుర్తించారు..

అంటే శృంగారంతోనే మెదడు పనితీరు.. శక్తి పెరుగుతుందని అంతేకాకుండా ఆయుష్షు కూడా పెరుగుతుందని తేలింది.