https://oktelugu.com/

పెళ్లి వద్దు.. కెరీరే ముద్దు.. నేటి ట్రెండ్ ఇదేనా?

‘లేచింది మహిళా లోకం.. దద్దరిల్లింది పురుష ప్రపంచం’ అని ఓ మహాకవి అన్నట్లుగా.. నేటి సమాజంలో ఆడవాళ్ల ప్రాముఖ్యత పెరిగింది. పురుషులకు ధీటుగా అన్ని రంగాల్లో వారి రాణిస్తున్నారు. ఇంటా బయట మహిళలు రాణిస్తూ పురుషాధిక్యానికి సవాల్ విసురుతున్నారు. ఆడవాళ్లంటే వంటింటి కుందేళ్లు కాదు.. దేశాన్ని కూడా సైతం పాలించగలమని నిరూపిస్తున్నారు. Also Read: చేపల్లో కరోనా వైరస్.. చేపలు తింటే ఆరోగ్యానికి ప్రమాదమా..? ఒకప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నా.. నేటి సమాజంలో మాత్రం ఆడవాళ్లతోపాటు.. మగవాళ్ల […]

Written By:
  • NARESH
  • , Updated On : November 14, 2020 / 11:45 AM IST
    Follow us on

    ‘లేచింది మహిళా లోకం.. దద్దరిల్లింది పురుష ప్రపంచం’ అని ఓ మహాకవి అన్నట్లుగా.. నేటి సమాజంలో ఆడవాళ్ల ప్రాముఖ్యత పెరిగింది. పురుషులకు ధీటుగా అన్ని రంగాల్లో వారి రాణిస్తున్నారు. ఇంటా బయట మహిళలు రాణిస్తూ పురుషాధిక్యానికి సవాల్ విసురుతున్నారు. ఆడవాళ్లంటే వంటింటి కుందేళ్లు కాదు.. దేశాన్ని కూడా సైతం పాలించగలమని నిరూపిస్తున్నారు.

    Also Read: చేపల్లో కరోనా వైరస్.. చేపలు తింటే ఆరోగ్యానికి ప్రమాదమా..?

    ఒకప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నా.. నేటి సమాజంలో మాత్రం ఆడవాళ్లతోపాటు.. మగవాళ్ల ఆలోచనలో మార్పు వచ్చినట్లు స్పష్టంగా కన్పిస్తోంది. ఆడపిల్ల పుట్టిందంటే ఒకప్పుడు తల్లిదండ్రులు భారంగా భావించేవారు.. పిల్ల పెద్దమనిషి అయిందంటే పెళ్లి చేసి పంపించేందుకే మొగ్గుచూపేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఆడపిల్లలు కూడా మగవాళ్లతో సమానంగా చదువుల్లో.. ఉద్యోగాల్లో రాణిస్తూ ఆర్థికంగా కుటుంబానికి అండగా నిలుస్తున్నారు.

    తల్లిదండ్రులు సైతం అమ్మాయిల పెళ్లి కంటే చదువు.. కెరీర్ పైనే దృష్టి పెడుతున్నారు. దీంతో ఆడపిల్లల వివాహా వయస్సు క్రమంగా పెరిగిపోతుందని కేంద్ర ప్రభుత్వ అధ్యాయనం తేలింది. దశాబ్ద కాలం క్రితం వ‌రకు ఆడ‌పిల్లల స‌గ‌టు వివాహ వ‌య‌స్సు 18-20 ఏళ్ల మధ్యలో ఉండేది. కానీ ఇప్పుడు 21ఏళ్లు దాటిన తర్వాతే మెజార్టీ అమ్మాయిలు పెళ్లి చేసుకుంటున్నట్లు వెల్లడైంది.

    2006లో దేశవ్యాప్తంగా యువతుల సగటు వివాహ వయస్సు 20.5 ఏళ్లుగా ఉండేది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 19.5 ఏళ్లే ఉండేది. ఇప్పుడది తెలంగాణలో ఆడపిల్లల వివాహ సగటు వయస్సు 22 ఏళ్లకు చేరింది. గ్రామీణ యువతుల సగటు వివాహా వయస్సు 19.2నుంచి 21.6 ఏళ్లకు పెరిగింది. పట్టణ ప్రాంతాల్లో అమ్మాయిల సగటు వ‌య‌స్సు 20.6 నుంచి 22.8 ఏళ్లకు చేరింది. ప్రధానంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2006లో 10.2శాతం మంది ఆడపిల్లలకు 18 ఏళ్లలోపే వివాహాలు జరుగగా ఇప్పుడు ఆ వయస్సులో వివాహాలు 1.9శాతానికి త‌గ్గినట్లు వెల్లడైంది.

    Also Read: ఈ మాస్క్ ధరిస్తే గంటలో కరోనా వైరస్ ఖతం..!

    అమ్మాయిలు పెళ్లిపై కంటే కెరీర్ పైనే ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. తమ కాళ్లపై తాము నిలబడ్డాకే పెళ్లి చేసుకోవాలని ఆశిస్తున్నారు. ఎవరీ వద్ద చేయి చాపకుండా బ్రతుకాలని అమ్మాయిలు ఆలోచిస్తున్నారు. ప్రస్తుత రోజుల్లో భార్యభర్తలు ఇద్దరు సంపాదిస్తే ఇళ్లు గడుస్తుంది. దీంతో అబ్బాయిలు సైతం ఉద్యోగాలు చేసే అమ్మాయిలనే పెళ్లి చేసుకునేందుకు ఇష్టపడుతున్నారు. ఈ కారణంగానే ఆడవాళ్ల వివాహా వయస్సు క్రమంగా పెరిగిపోతుందని తెలుస్తోంది. రానున్న రోజుల్లో ఇది మరింత పెరిగే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.