Political Leaders : దేశ రాజకీయాలు, వ్యవస్థలను చూసి ఓ సోషల్ మీడియా మేధావికి కడుపు మండింది.. ప్రజాస్వామ్యమా! ఎవ్వరిని రక్షిస్తున్నావు? అంటూ అతడు నినదించాడు. రాజకీయ నేతల తీరును గట్టి పదాలతో కడిగేశాడు. రాజకీయ నేతలు, వేశ్యలతో పోల్చాడు. వేశ్యలే నయం అంటూ ఉదాహరణలతో వివరించాడు. అతడి ఆవేదన అక్షరరూపమైంది.. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
పెద్దలు తినే గడ్డిని లాబీయింగ్ అనే ముద్దు పేరుతో పిలుస్తాం. అదే వేశ్య తినే తిండిని పాపపు కూడుతో నిందిస్తాం. వేశ్య కుటుంబం కోసం తప్పు చేస్తున్నది. పెద్దలు మాత్రం అధికార దాహంతో తప్పులు చేస్తున్నారు.వేశ్య వద్ద జబ్బులు తప్పు డబ్బులు ఉండవు. అందుకేనేమో వేశ్యను వ్యవస్థలు బహిష్కరిస్తున్నాయి. పెద్దలు వద్ద డబ్బులు మస్తుగా ఉండడంతో, వ్యవస్థలను నాశనం చేసే జబ్బులు వారి వద్ద ఉన్నప్పటికీ… గడ్డితింటున్న పెద్దలకు వ్యవస్థలే రక్షణగా మిగులుతున్నాయి!
మతస్వాములే, కులపెద్దలే వారికి రక్షణగా ఉంటుంటే. లాబీయింగ్ పేరుతో వేశ్యరికం చేస్తుంటే. స్వయంపాకాలు తీసికొంటూ, శాలువాలు కప్పుకొంటూ… మన గెద్ధల/పెద్దల తప్పులను కాపాడే తార్పుడు గాళ్ళుగా ఉంటుంటే… మనం మాత్రం నా మతం, నా కులం, నా పార్టీ అంటూ చెవిలో “పువ్వులు” పెట్టుకొని తిట్టుకు చస్తున్నాం?
‘రక్షణ కావాల్సింది ప్రజాస్వామ్య భక్షకులకు కాదు, ప్రజాస్వామ్యానికి మాత్రమే అని గుర్తించండి.’ అంటూ సోషల్ మీడియా ఉద్యమకారుడు పిలుపునిచ్చిన నినాదం ఇప్పుడు అందరినీ ఆలోచింపచేస్తోంది. ఒక కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తోంది.