
YS Vivekananda Reddy Murder Case: మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి కేసు విచారణ సాగిస్తున్న అధికారులకు విస్తు గొలిపే నిజాలు తెలుస్తున్నాయి. భూ లావాదేవీలు, సెటిల్మెంట్లు, అమ్మాయిలతో సంబంధాలు.. ఇలా అనేక అంశాల్లో వివేకానంద రెడ్డి ప్రమేయం ఉండడం విచారణ అధికారులను ఆశ్చర్యానికి గురి చేస్తుంది. వృద్ధాప్యానికి చెరువులో ఉన్న వివేకానంద రెడ్డిలో ఇన్ని దురలవాట్లు ఉండడం పట్ల విచారణ అధికారులు బంధమే ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తుంది. వివేకానంద రెడ్డిలోని దుర అలవాట్లే హత్యకు కారణమైందా..? అన్న చర్చ ఇప్పుడు నడుస్తోంది.
రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య వెనక అనేక అంశాలు దాగి ఉన్నాయి. ఈ హత్య జరిగి సుమారు నాలుగేళ్లు దాటుతున్న ఇప్పటికే నేరస్తులు ఎవరన్నది తేలలేదు. సిబిఐ ఈ కేసును విచారిస్తున్న సంగతి తెలిసిందే.
కుటుంబంలో వివాదాలే కారణమా..
వైఎస్ వివేక కుటుంబంలో తలెత్తిన ఆస్తి తగాదాలే హత్యకు కారణమయ్యాయన్న విమర్శలు ఉన్నాయి. ప్రధానంగా వివేకానంద రెడ్డి చివరి దశలో చేసుకున్న వివాహం, వీరికి పుట్టిన సంతానం, ఆస్తి పంపకాలకు సంబంధించిన తలెత్తిన గొడవ వ్యవహారంలో ఈ హత్య జరిగిందన్న ప్రచారము జరుగుతోంది. ముఖ్యంగా ఆస్తికి సంబంధించిన పవర్ ఆఫ్ పటార్ ను చివరి దశలో వివాహం చేసుకున్న కుటుంబ సభ్యులకి అని వివేకానంద రెడ్డి తేల్చి చెప్పినట్లు చెబుతున్నారు. దీనిపై తలెత్తిన వివాదంలోనే హత్య వరకు పరిణామాలు దారి తీసినట్లు చెబుతున్నారు. ఈ వ్యవహారాన్ని తెలిపితే మొత్తం పవర్ ఆఫ్ పటార్ విషయం అంతా బయటకు వస్తుందని, మొత్తం మరణం బయటపడుతుందని కుటుంబ సభ్యులు భావిస్తూ వచ్చారు.
వ్యక్తిగత జీవితంలో దురలవాట్లు ఎన్నో..
వైయస్ వివేకానంద రెడ్డి వ్యక్తిగత జీవితంలో అనేక దూరాలవాట్లు ఉన్నట్లు చెబుతున్నారు. ఆయన ఎక్కడికైనా ప్రయాణాలు సాగిస్తే రైలులో కూడా తనతో పాటు అమ్మాయి ఉండాలని వివేక చెప్పేవారట. వివేకానంద రెడ్డి పెద్ద ఉమనైజర్ అన్న ప్రచారం ఉంది. ఇకపోతే సెటిల్మెంట్ వ్యవహారాలను కూడా భారీగానే నడిపే వారిని చెబుతున్నారు. సెటిల్మెంటు వ్యవహారాలకు సంబంధించి ఎక్కువగా బెంగుళూరు వెళ్లేవాడని చెబుతున్నారు. ముందు వివేకానంద రెడ్డి కేసు విషయంలో బెంగళూరు సెటిల్మెంట్ వ్యవహారాన్ని గట్టిగా చెప్పారు. అయితే ఆ తర్వాత విచారణలో ఈ అంశం లేదని తేల్చి చెప్పేశారు.
అక్కడే సునీతకు – జగన్ కు మధ్య గొడవ..
సీఎం జగన్మోహన్ రెడ్డి, వివేకానంద రెడ్డి కుమార్తె సునీతకు మధ్య ఈ హత్యకు సంబంధించి ఒక చిన్న వ్యవహారంలో గొడవ తలెత్తింది. అదే ఇప్పుడు రెండు కుటుంబాల మధ్య వైరానికి కారణమైనట్లు చెబుతున్నారు. సెటిల్మెంట్ వ్యవహారంతో పాటు పవర్ ఆఫ్ పటార్ విషయం గురించి ఏం చేయాలని ఏం జగన్ మోహన్ రెడ్డి ఆలోచిస్తున్న తరుణంలో సునీత సిబిఐ విచారణ కావాలని డిమాండ్ చేసింది. ఈ వ్యవహారాలన్నీ బయటకు వస్తాయన ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ఇతర కుటుంబ సభ్యులు కాస్త వెనక్కి తగ్గారు. కానీ సునీత గట్టిపట్టు పట్టడంతో కుటుంబ సభ్యులంతా ఒకచోట కూర్చుని దేనిపై చర్చించే ప్రయత్నం చేశారు. ఈ సమయంలోనే సునీత దేవి రెడ్డి శివశంకర్ రెడ్డి హత్య చేయించాడని, అన్న తనకు మరో వ్యక్తి చెప్పారని చెప్పింది. అక్కడే ఉన్న సీఎం జగన్మోహన్ రెడ్డి శివశంకర్ రెడ్డిని అనుమానించడానికి తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. అలా అయితే మీ భర్త హత్య చేయించాడన్న అనుమానాన్ని సీఎం జగన్ మోహన్ రెడ్డి వ్యక్తం చేశారు. దీనికి తీవ్రంగా స్పందించిన సునీత మా ఆయన అనుమానిస్తారా అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్లు తెలిసింది.

అక్కడే పెరిగిన దూరం..
సీఎం జగన్మోహన్ రెడ్డికి అప్పటికే వచ్చిన పలు రిపోర్ట్ లు, ఇతర అంశాలను ఆధారంగా చేసుకొని సునీత భర్త పేరును ప్రస్తావించారు. దీనిపై సునీత తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అప్పటినుంచి కుటుంబ సభ్యులతో దూరంగా ఉంటూ కేసు వ్యవహారం పై ముందుకు వెళుతున్నారు. అయితే వివేకానంద రెడ్డి వ్యవహార శైలి, చివరి దశలో చేసుకున్న పెళ్లి, పిల్లలు, పవర్ ఆఫ్ పటార్ తన ఉద్దేశంతో ఇతర కుటుంబ సభ్యులు కేసు విషయంలో కాస్త వెనక్కి తగ్గారు. కానీ అనుక్షంగా ఈ కేసులో అవినాష్ రెడ్డి, ఇతర కుటుంబ సభ్యుల పాత్ర ఉన్నట్లు సిబిఐ ధ్రువీకరించడంతో ప్రస్తుతం ఈ కేసు వ్యవహారం ఎటువైపు వెళుతుందో అన్న చర్చ జోరుగా నడుస్తోంది.