Snake and Boy : దేవుడున్నాడా లేడా? అనేది దశాబ్దాలు.. శతాబ్దాలుగా ఏకాభిప్రాయం లేని ప్రశ్నగానే మిగిలిపోయింది. అయితే.. కొన్ని సంఘటనలు చూసినప్పుడు మాత్రం విధిని, దేవుడిని నమ్మేవారు మరింత బలంగా విశ్వసిస్తారు. భగవంతుడు లేడని చెప్పేవారు కూడా ఆలోచనలో పడతారు. అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. మరి, దాని వివరాలు ఏంటన్నది చూద్దాం.
మనిషికి చావు ఏ రూపంలో వస్తుందో ఎవ్వరూ చెప్పలేరు. దీర్ఘకాల సమస్యతో కన్నుమూసేవారు కొందరైతే.. రెప్పపాటులో ప్రాణాలు కోల్పోయేవారు మరికొందరు. అయితే.. ఈ రెండో రకం ప్రాణాపాయం నుంచి కొందరు తృటిలో తప్పించుకుంటారు. ఇలాంటి ఘటనలు చూసినప్పుడు ఎవ్వరైనా షాక్ కు గురవ్వాల్సిందే. ఇలాంటి ఘటనే మధ్యప్రదేశ్ లో జరిగింది.
ఒక దుకాణంలో పదేళ్ల బాలుడు సెల్ ఫోన్ లో ఏదో చూసుకుంటున్నాడు. అయితే.. కాసేపటి తర్వాత షాపులో ఉన్న బెంచీపై నడుము వాల్చేందుకు సిద్ధమయ్యాడు. తలెత్తి చూసే సరికి పైన పాము కనిపించింది. వెంటనే లేచి బయటకు పరిగెత్తాడు. ఆ బాలుడు అలా లేచాడో లేదో.. సరిగ్గా అతను పడుకున్న చోటనే ప్రమాదకరమైన నల్లత్రాచు పాము పడింది.
పాము ఎలుకను వేటాడుతుండగా.. దాన్నుంచి తప్పించుకునేందుకు ఎలుక ఆ బాలుడు పడుకోవాలనుకున్న ప్రాంతంలో దూకేసింది. దాన్ని పట్టుకునేందుకు పాము కూడా వెంటనే దూకింది. ఆ బాలుడు గనక అక్కడ పడుకుని ఉంటే ఖచ్చితంగా అతనిమీద పాము పడేది. ఆ వేటలో భాగంగా.. అతడిని ఖచ్చితంగా కాటువేసి ఉండేది.
అతను ఒక్కసారిగా లేచి బయటకు వెళ్లడంతో.. ఎలుక, పాము అక్కడ దూకి పరుగులు పెట్టాయి. ఎలాగైనా ఎలుకను పట్టుకోవాలని పాము వెంబడించినప్పటికీ.. అది దొరకలేదు. ఓ సందులో దూరి తప్పించుకుంది. ఆ తర్వాత పాము అక్కడి నుంచి బయటపడేందుకు కాసేపు ప్రయత్నాలు చేయగా.. ఎక్కడా చోటు దొరకలేదు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
जाको राखे साईंया मार सके ना कोय !
मध्यप्रदेश के रायसेन जिले का यह वीडियो जिसमे चूहे और साँप की दौड़ में बालक बाल बाल बचा। pic.twitter.com/HGoaXXOgg0
— हितानंद Hitanand (@HitanandSharma) September 10, 2021
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Snake and boy boy escaped from snake bite in madhya pradesh video viral
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com