SM Krishna: ఎస్ఎం కృష్ణ కర్ణాటక రాజకీయాలలో చెరగని ముద్ర వేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా పేరుపొందిన ఆయన.. తన రాజకీయ జీవితాన్ని మద్దూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మొదలుపెట్టారు. 1962లో మద్దూరు శాసనసభ నుంచి ఇండిపెండెంట్ గా ఆయన పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ అభ్యర్థి ఎంఎం గౌడ్ చేతిలో ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత మాండ్య పార్లమెంటు స్థానంలో సిట్టింగ్ ఎంపీ 1968లో కన్ను మూయడంతో.. ఆ పార్లమెంట్ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో ఎస్ఎం కృష్ణ పోటీ చేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఓడించి పార్లమెంటులో అడుగుపెట్టారు. అప్పటినుంచి వరుసగా మూడుసార్లు మాండ్య పార్లమెంటు నుంచి మూడుసార్లు ఎంపీగా విజయం సాధించారు. నాటి రోజుల్లోనే హ్యాట్రిక్ సాధించి రికార్డును సొంతం చేసుకున్నారు. 1970 కాలంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. 1971, 80 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫునుంచి పోటీ చేసి విజయం సాధించారు. మాండ్యా స్థానాన్ని కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా మార్చడంలో కృష్ణ విజయవంతమయ్యారు.
పాంచ జన్య యాత్ర..
కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఎస్ఎం కృష్ణ 1999లో ఉన్నప్పుడు.. అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. నాడు కాంగ్రెస్ పార్టీని గెలుపు మార్గంలో నడిపించడంలో ఎస్ఎం కృష్ణ విజయవంతమయ్యారు. నాడు ఆయన పాంచ జన్య యాత్రకు శ్రీకారం చుట్టారు. అది కాంగ్రెస్ పార్టీకి బలాన్ని అందించింది. 1999లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రావడంతో.. ఎస్ఎం కృష్ణ ముఖ్యమంత్రి అయ్యారు. 2004 వరకు ఆయన 16వ కర్ణాటక ముఖ్యమంత్రిగా కొనసాగారు. 2004 డిసెంబర్లో మహారాష్ట్రకు గవర్నర్ గా ఎస్ఎం కృష్ణ నియమితులయ్యారు. 2008 మార్చి ఐదున తన పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత తన ప్రస్థానాన్ని రాజ్యసభవైపు మళ్లించుకున్నారు. 2009లో మన్మోహన్ సింగ్ మంత్రి వర్గంలో విదేశాంగ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.
బిజెపిలో రాజకీయ ప్రవేశం.. జీవితమంతా కాంగ్రెస్ తో ప్రయాణం..
ఎస్ఎం కృష్ణ తన రాజకీయ ప్రవేశాన్ని బిజెపి ద్వారా చేశారు. ఆ తర్వాత తన జీవితం మొత్తం కాంగ్రెస్ పార్టీతో ప్రయాణించారు.. 2017 జనవరి 29న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. 2017 మార్చి లో భారతీయ జనతా పార్టీలో చేరారు. అనారోగ్య సమస్యలతో 2023 జనవరి ఏడున రాజకీయాల నుంచి నిష్క్రమిస్తున్నట్టు ప్రకటించారు. ఎస్ఎం కృష్ణ నాటి రోజులోనే ప్రేమ వివాహం చేసుకున్నారు.. ఆయనకు ఇద్దరు కుమార్తెలు. శృతి వాహిని పేరుతో 2019లో ఆయన జీవిత చరిత్ర ను విడుదల చేశారు. కన్నడ నటుడు రాజ్ కుమార్ ను నాడు వీరప్పన్ అపహరించారు. అప్పుడు ముఖ్యమంత్రిగా ఎస్ఎం కృష్ణ ఉన్నారు.. అయితే ఎస్ఎం కృష్ణ స్మృతి వాహిని లో దేవ గౌడ జెడిఎస్ నుంచి కాంగ్రెస్ లో ఎందుకు చేరాలనుకున్నారో ప్రముఖంగా ప్రస్తావించారు. అది అప్పట్లో సంచలనం కలిగించింది. ఆ తర్వాత దీనిని దేవెగౌడ ఖండించారు.