https://oktelugu.com/

Sandeep Reddy Vanga and Chiranjeevi : సందీప్ రెడ్డి వంగ, చిరంజీవి కాంబోలో సినిమా ఓకే అవ్వనుందా..?

ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో తమదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళుతున్న స్టార్ హీరోలు చాలామంది ఉన్నప్పటికి వాళ్ళకి స్టార్ డమ్ ని కట్టబెట్టిన దర్శకులు కూడా చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్నారనే చెప్పాలి.

Written By:
  • Gopi
  • , Updated On : December 10, 2024 / 08:42 AM IST

    Chiranjeevi

    Follow us on

    Sandeep Reddy Vanga and Chiranjeevi : ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో తమదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళుతున్న స్టార్ హీరోలు చాలామంది ఉన్నప్పటికి వాళ్ళకి స్టార్ డమ్ ని కట్టబెట్టిన దర్శకులు కూడా చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్నారనే చెప్పాలి. ఇక ప్రస్తుతం యంగ్ డైరెక్టర్లు స్టార్ హీరోలను డైరెక్ట్ చేయడంలో చాలా బిజీగా ఉన్నారు…

    తెలుగు సినిమా ఇండస్ట్రీ అనగానే మనకు ముందుగా మెగాస్టార్ చిరంజీవి గారి పేరు గుర్తుకొస్తుంది. ప్రస్తుతం ఆయన ఇప్పటికీ కూడా సినిమాలను చేస్తూ ముందుకు దూసుకెళ్లడం అనేది నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి. ఇక ఎప్పుడైతే ఆయన సినిమా ఇండస్ట్రీకి వచ్చాడో అప్పటినుంచి ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీని ఏకఛత్రాధిపత్యంతో ఏలుతున్న ఏకైక హీరోగా కూడా గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక 70 సంవత్సరాల వయసులో కూడా సినిమాలను చేస్తూ ప్రేక్షకులను అలరించే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఇక అందులో భాగంగానే యంగ్ డైరెక్టర్స్ తో సినిమాలను చేయాలని చూస్తున్నాడు. ఇక రీసెంట్ గా దసర సినిమాతో మంచి విజయాన్ని సాధించిన శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో చిరంజీవి ఒక సినిమా చేస్తున్నానని అనౌన్స్ చేశాడు. ఇక శ్రీకాంత్ ఓదెల చిరంజీవి అభిమాని కావడం వల్ల చిరంజీవిని ఆయన ఏ రేంజ్ లో చూపించబోతున్నాడనేది కూడా తెలియాల్సిన అవసరమైతే ఉంది. ఇక ఇతనితోపాటుగా అర్జున్ రెడ్డి సినిమాతో తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో కూడా ఒక భారీ బడ్జెట్ సినిమాని చేయడానికి చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ న్యూస్ మీద ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ మెంట్ అయితే రాలేదు. నిజానికి సందీప్ రెడ్డి వంగ కూడా చిరంజీవి అభిమాని చిరంజీవిని చూసే తను సినిమాల్లోకి రావాలనుకున్నానని చాలాసార్లు చెప్పడం విశేషం…

    మరి ఇలాంటి సందర్భంలో మెగాస్టార్ చిరంజీవి సందీప్ రెడ్డివంగ కాంబినేషన్ లో సినిమా వస్తే అది ఎలా ఉండబోతుంది ఇప్పటివరకు బోల్డ్ కంటెంట్ తో సినిమాలను చేసిన సందీప్ వంగ ఇప్పుడు ఎలాంటి సినిమాని చేయబోతున్నాడనేది తెలియాల్సి ఉంది.

    ఇక ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ ని హీరోగా పెట్టి ‘స్పిరిట్ ‘ అనే సినిమాను చేస్తున్నాడు…ఇక ప్రస్తుతం తను బిజీగా ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి ఈ సినిమా ఎప్పుడు సెట్స్ మీదికి వెళుతుంది అనే విషయాల మీద సరైన క్లారిటీ అయితే లేదు కానీ మొత్తానికి అయితే స్పిరిట్ సినిమాని కంప్లీట్ చేసిన తర్వాత సందీప్ వంగ చిరంజీవి తో ఒక సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఇక దీనికి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ రావాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

    చిరంజీవి శ్రీకాంత్ ఓదెల లాంటి డైరెక్టర్లతో సినిమాలు చేయడానికి కమిట్ అయ్యాడు. కాబట్టి ఈ సినిమాలను ఫినిష్ చేసుకున్న తర్వాత సందీప్ రెడ్డి వంగ తో సినిమా చేస్తారు అంటు సినిమా ఇండస్ట్రీ లో కొంత మంది సినిమా మేధావులు వాళ్ల అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…