https://oktelugu.com/

women : మహిళలు 40 సంవత్సరాలు వచ్చాయా? ఇక మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే..

కుటుంబం ఆరోగ్యంగా ఉండాలంటే ముందుగా ఇంట్లోని మహిళలు ఆరోగ్యంగా ఉండాలి. ఇంట్లోని పూర్తి పనులు, వంట పనులు చూసుకునేది వారే కాబట్టి ఆ ఇంటిల్లి పాది ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ఆమె చేతిలోనే ఉంటుంది.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : December 10, 2024 / 08:49 AM IST

    women

    Follow us on

    women : కుటుంబం ఆరోగ్యంగా ఉండాలంటే ముందుగా ఇంట్లోని మహిళలు ఆరోగ్యంగా ఉండాలి. ఇంట్లోని పూర్తి పనులు, వంట పనులు చూసుకునేది వారే కాబట్టి ఆ ఇంటిల్లి పాది ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ఆమె చేతిలోనే ఉంటుంది. అందుకే కుటుంబం ఆనందానికి ముఖ్య కారణం ఆ ఇంట్లోని మహిళలే అంటున్నారు నిపుణులు. ఇంటి సభ్యుల క్షేమం కోసం మహిళలు చాలా కష్టపడతారు. కానీ వారి కంటూ సరైన సమయం కూడా ఉండదు. అందుకే రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. దీంతో అనేక అనారోగ్య సమస్యలు ఎటాక్ చేస్తుంటాయి.

    ఇక యుక్త వయసులో ఉండే శక్తి.. వయసు పెరిగే కొద్దీ చాలా మందికి ఉండదు. వయసు పెరిగే కొద్దీ శరీరం అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటుంది. అందుకే వయసు పెరుగుతున్న కొద్దీ మరింత ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. ఇక మహిళలకు 40 ఏళ్లు వచ్చాయంటే తమ ఆరోగ్యంపై ఖచ్చితంగా శ్రద్ధ తీసుకోవాలి అంటున్నారు నిపుణులు. మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏ ఆహారం తీసుకోవాలి? అనే వివరాలు ఓ సారి చూసేద్దాం.

    తినే ఆహారంలో హెల్తీ డైట్ ఉండేలా చూసుకోవాలి. తమకంటూ కొద్ది సమయాన్ని కచ్చితంగా కేటాయించాలి. లేదంటే మీరే సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే 40 సంవత్సరాలు వస్తే చాలు మీ శరీరంలో శక్తి చాలా వరకు తగ్గుతుంటుంది. నీరసం, అలసట వంటివి కూడా త్వరగానే వచ్చేస్తుంటాయి. దీనికి తోడు అనేక వ్యాధులు కూడా బోనస్ గా వస్తుంటాయి. అందుకే వీటి నుంచి దూరంగా ఉండాలంటే పండ్లు తీసుకోవడం మర్చిపోవద్దు. సీజనల్ ఫుడ్స్ మరింత ఎక్కువగా గుర్తు పెట్టుకోండి. రోజూ ఒక గ్లాస్ పాలు మస్ట్ అంటున్నారు నిపుణులు. డ్రై ఫ్రూట్స్ కూడా ప్రతి రోజూ తీసుకోవడం అలవాటు చేసుకోండి. పెరుగు, జున్ను, నెయ్యి వంటివి మీ ఆహారంలో యాడ్ చేసుకోవడం వల్ల మరింత ఎక్కువ ప్రయోజనాలను పొందవచ్చు.

    బెర్రీ పండ్లకు కూడా మీ డైట్ లో కాస్త ప్లేస్ ఇవ్వండి. అంతేకాదు కూరగాయలు, ఆకు కూరలు మస్ట్ అని గుర్తు పెట్టుకోండి. ఇక గింజలు, చేపలు, అప్పుడప్పుడు మాంసాన్ని మర్చిపోవద్దు. మీ కంటూ స్పెషల్ ఆహారం తయారుచేసుకునే సమయం లేకపోతే కాస్త వండే ఆహారాన్ని ఆరోగ్యకరమైనదిగా ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది. దీంతో మీరు మాత్రమే కాదు మీ కుటుంబ ఆరోగ్యం కూడా సేఫ్ అవుతుంది. బద్దకంతో పెరుగు అన్నం, పప్పన్నం, నెయ్యిన్నం అంటూ వీటికి మాత్రమే పరిమితం అవుతూ కూరగాయలను పూర్తిగా స్కిప్ చేసే విధానాలను మానేయండి అంటున్నారు నిపుణులు.