దేశంలో రాజకీయ పార్టీలన్నాక ఒక స్ట్రాటజీ అవసరం. అలా ఉంటూనే అప్ డేట్ అవుతూ ఉంటే ప్రజల్లో పేరు ప్రఖ్యాతలు.. దాంతోపాటు అధికారం సిద్ధిస్తుంది. అయితే సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయాక రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్ష పదవిని వదిలేసి అస్త్రసన్యాసం చేశాడు. అప్పటి నుంచి అజ్ఞాతంలో ఉంటే ఈ ఏడాది కాస్త యాక్టివ్ అయ్యాడు.
అయితే కేంద్రంలోని బలమైన బీజేపీని ఎదుర్కొనే విషయంలో కాంగ్రెస్ పార్టీ వేస్తున్న తప్పటడుగులు ఆ పార్టీని మరింత దిగజార్చుతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
Also Read: 22న బలపరీక్ష.. ఉత్కంఠగా రాజస్థాన్ రాజకీయం
ఆరు నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ ఆరు తప్పులు చేసింది. తద్వారా అధికార బీజేపీకి మరింత బలాన్ని ఇచ్చిందని విశ్లేషకులు అంచనావేస్తున్నారు.
కరోనా వ్యాపించకముందు ఫిబ్రవరిలో దేశ రాజధాని ఢిల్లీలో షహీన్ బాగ్ అల్లర్లు కాంగ్రెస్ ప్రతిష్టను దిగజార్చాయి. దేశద్రోహులుగా ముద్రపడిన కొందరు హిందుత్వవాదులతో గొడవపడడం.. ఆ అల్లర్లలో పలువురు మరణించడం.. కాంగ్రెస్ పార్టీ స్టాండ్ వ్యతిరేకులకు ఇవ్వడంతో ప్రజల్లో ఒకింత ఆగ్రహజ్వాలలను కాంగ్రెస్ ఎదుర్కొంది. పాకిస్తాన్ కు జైకొట్టిన వారికి కాంగ్రెస్ మద్దతు ఇచ్చిందంటూ బీజేపీ ప్రచారం చేయడం ఆ పార్టీకి బలాన్నిచ్చింది.
ఇక మార్చిలో మధ్యప్రదేశ్ లో ఎంతో భవిష్యత్ ఉన్న యువనేత జ్యోతిరాధిత్య సింధియాను కాంగ్రెస్ పార్టీ కోల్పోయింది. సీనియర్లకు పీఠం ఇచ్చి యువ సింధియాను బీజేపీకి వదులుకోవడం కాంగ్రెస్ చేసిన రెండో తప్పు. అందుకే మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ సర్కార్ కూలి.. బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది.
ఇక ఏప్రిల్ లో వలస కార్మికులను రెచ్చగొట్టి కరోనా వేళ బీజేపీపై కాంగ్రెస్ ఒత్తిడి తెచ్చే పని చేసింది. కానీ బీజేపీ నష్ట నివారణ చర్యలతో అందులోనూ మైలేజీని కాంగ్రెస్ సొంత చేసుకోలేకపోయింది.
Also Read: రాజకీయాల్లో పవన్ పై పెరిగిన ఒత్తిడి?
ఇక మే నెలలో ఓడిన సంవత్సరం తర్వాత కూడా కాంగ్రెస్ కురువృద్ధులకే అందలం ఎక్కించడంపై యువ కాంగ్రెస్ వాదులు గళం ఎత్తారు. అటు సింధియా.. ఇటు సచిన్ పైలెట్ తిరుగుబావుటా ఎగురవేయడం కాంగ్రెస్ కోలుకోకుండా చేసింది.
ఇక జూన్ లో చైనాతో వార్ లో ఆ దేశానికి మద్దతిచ్చేలా.. భారత్ ను అవమానించేలా కాంగ్రెస్ వ్యవహరించడం.. దాన్ని బీజేపీని క్యాష్ చేసుకోవడం తెలిసిందే. ఇక రాజస్థాన్ కుంపటిలో జులైలో సచిన్ పైలెట్ బయటకు పోవడంతో యువ త్రయం రెండు రాష్ట్రాల్లో తుడుచుపెట్టుకుపోయింది.
ఇలా ఆరు నెలల్లో కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరు తప్పులు ఆ పార్టీని మరింత కృంగదీశాయని.. తప్పులను సరిదిద్దుకోకపోతే ఆ పార్టీ మూల్యం చెల్లించడం తప్పదు అని క్షేత్రస్థాయి కాంగ్రెస్ వాదులు హెచ్చరిస్తున్నారు.