ఎన్నో రాష్ట్రాల్లో ఎందరో సీఎంలు మంత్రివర్గ విస్తరణలు చేస్తుంటారు. ఫలానా వారికి మంత్రి పదవులని.. ఫలానా వారు అలిగారని ఊహాగానాలు వెల్లువెత్తాయి. కానీ ఏపీలో మాత్రం అలాంటి అసమ్మతులకు.. అసంతృప్తులకు సీఎం జగన్ అవకాశం ఇవ్వడం లేదు.
నిన్నటికి నిన్న స్పీకర్ తమ్మినేనిని మంత్రివర్గంలోకి తీసుకుంటారంటూ ప్రచారం సాగింది. కానీ తీసుకోవడం లేదు. ఆయన వ్యతిరేక స్వరం ఒక్కటి కూడా వినిపించడం లేదు. ఇక మిగతా నేతలు కూడా అంతే.. సామాజిక కోణంతో బడుగు, బలహీన వర్గాలకు పదవులు ఇస్తున్న జగన్ దూకుడు ముందు ఎవరూ వైసీపీలో నోరెత్తని పరిస్థితి నెలకొంది. నోరెత్తితే బీసీల విషయంలో విలన్లు అయిపోతారు కాబట్టి కిక్కురుమనకుండా ఉంటున్నారు. దీంతో మీడియా కూడా పనిలేకుండా చేస్తున్నారు జగన్.
కన్నాపై అదిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసిందా?
ఇన్నాళ్లు మంత్రులుగా చలామణీ అయిన మోపిదేవి, పిల్లి సుభాష్ లు రాజ్యసభ ఎంపీలుగా పోవడంతో ఖాళీ అయిన రెండు మంత్రిపదవులను భర్తీ చేసేందుకు సీఎం జగన్ ఏపీ కేబినెట్ విస్తరణ చేయబోతున్నాడనే ప్రచారం కొద్దిరోజులుగా సాగుతోంది. అయితే జూలై 22న బుధవారం మధ్యాహ్నం 1.29 నిమిషాలకు ఇద్దరు కొత్త మంత్రులతో ప్రమాణం స్వీకారం చేయబోతున్నారని ప్రభుత్వ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ముహూర్తాన్ని ఖరారు చేశారని.. రేపు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కొత్త మంత్రులతో ప్రమాణం చేయిస్తారని వార్తలు వస్తున్నాయి.
తూర్పు గోదావరి జిల్లాకు చెందిన శెట్టి బలిజ సామాజికవర్గానికి చెందిన రాంచంద్రాపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణతోపాటు శ్రీకాకుళం జిల్లాకు చెందిన మత్స్యకార కుటుంబానికి చెందిన పలాస ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజు పేర్లు దాదాపు మంత్రులుగా ఖరారైనట్టు సమాచారం.
22న బలపరీక్ష.. ఉత్కంఠగా రాజస్థాన్ రాజకీయం
ఇద్దరు బలహీన సామాజికవర్గాలకే జగన్ మంత్రి పదవులు ఇవ్వబోతున్నారనే ప్రచారం వైసీపీలో సాగుతోంది. అయితే మంత్రి పదవులు ఆశించిన తమ్మినేని సహా ఎవరూ నోరెత్తకపోవడం.. జగన్ నిర్ణయంపై స్పందించకపోవడం గమనార్హం.
ఈసారి ఆ ఇద్దరు మంత్రులతోపాటు కేబినెట్ లోని మరో నలుగురిని తీసేసి కొత్తవారిని తీసుకుంటారనే ప్రచారం జరిగింది. కానీ జగన్ మాత్రం అవేమీ లేకుండా కేవలం రెండు మాత్రమే భర్తీ చేయబోతున్నారు. దీంతో అటు వైసీపీ లోనూ.. ఇటు మీడియాలోనూ జగన్ వ్యూహాత్మక వైఖరిపై ఎటూ పాలుపోని పరిస్థితి నెలకొంది.