ఆరునెలల అప్పు ఒక్క నెలలోనే ఖర్చు: బయటపెట్టిన కాగ్

ఏపీ సర్కార్ పాలన రోజురోజుకు కష్టతరమవుతోందా..? అప్పుల కుప్పల్లో కూరుకుపోయిన ప్రభుత్వం మళ్లీ అప్పు కావాలని అడుగుతుందా..? అయితే ఈసారి రుణం ఇవ్వాలంటే కాగ్ మెలిక పెడుతుందా..? అనే చర్చలు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారాయి. ఇప్పటికే వేల కోట్లు అప్పులు తీసుకున్న జగన్ సర్కార్ కొత్త అప్పుల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోందట. అయితే ఇన్నాళ్లు అడిచిన రుణం ఇచ్చిన కేంద్రం తాజాగా కాగ్ నివేదిక ఆధారంగా రుణ పరిమితి ఉంటుందని తేల్చి చెప్పినట్లు సమాచారం. […]

Written By: NARESH, Updated On : July 29, 2021 12:31 pm
Follow us on

ఏపీ సర్కార్ పాలన రోజురోజుకు కష్టతరమవుతోందా..? అప్పుల కుప్పల్లో కూరుకుపోయిన ప్రభుత్వం మళ్లీ అప్పు కావాలని అడుగుతుందా..? అయితే ఈసారి రుణం ఇవ్వాలంటే కాగ్ మెలిక పెడుతుందా..? అనే చర్చలు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారాయి. ఇప్పటికే వేల కోట్లు అప్పులు తీసుకున్న జగన్ సర్కార్ కొత్త అప్పుల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోందట. అయితే ఇన్నాళ్లు అడిచిన రుణం ఇచ్చిన కేంద్రం తాజాగా కాగ్ నివేదిక ఆధారంగా రుణ పరిమితి ఉంటుందని తేల్చి చెప్పినట్లు సమాచారం.

అయా అవసరాల కోసం ఈ ఏడాది పలు రాష్ట్రాలు అప్పులు చేశాయి. ఏ రాష్ట్రం ఎంత రుణం తీసుకున్న విషయాన్ని కాగ్ నివేదిక బయటపెట్టింది. ఇందులో ఆర్థిక సంవత్సం మొదటి నెలలోనే ఆంధ్రప్రదేశ్ 19,714 కోట్లు తీసుకుంది. ఆ తరువాత కేరళ 14,010 కోట్లు తీసుకుంది. మిగతా రాష్ట్రాలు 10 వేల కోట్ల లోపే తీసుకున్నాయి. పక్కనున్న తెలంగాణ రాష్ట్రం రూ.1925 కోట్లు అప్పు చేసింది. ఇదిలా ఉండగా ఏపీ ప్రభుత్వం ఏప్రిల్ నెలలో 19,714 కోట్లు తీసుకున్న రుణం ఆ నెలలోనే మొత్తం ఖర్చు చేసింది.

వాస్తవానికి కేంద్రం ఏపీ ప్రభుత్వానికి రూ.37,079 కోట్ల రుణ పరిమితి విధించింది. ఇందులో ఇప్పటికే రూ.19,714 కోట్లు తీసుకొని ఖర్చు చేసింది. ప్రజా రుణం కింద రూ.4వేల కోట్లు, ప్రజాపద్దుల కింద రూ.15 వేల కోట్లు ఖర్చు చేశారు. అయితే రూ.19,714 కోట్ల మొత్తాన్ని ఆరునెలల్లో ఖర్చు చేయాల్సి ఉండగా.. ఒక్కనెలలోనే ఖర్చు పెట్టడాన్ని కాగ్ ప్రత్యేకంగా ప్రస్తావించింది. ఏప్రిల్ నెలలలో పన్నుల రాబి రూ.7738 కోట్లు ఉండగా.. రాబడి కంటే మూడింతలు ఎక్కువగా అప్పులు చేస్తున్నట్లు తేలింది.

ఏపీలో సర్కార్ ఎడాపెడా చేస్తున్న అప్పులతో ఆర్థిక వ్యవస్థ దివాలా తీస్తోంది. కేంద్ర ప్రభుత్వంతో పాటు కాగ్, ఇతర రాజ్యాంగ సంస్థలు ఏపీకి ఆర్థిక పరిస్థితిని ఎప్పటికప్పుడు బయటపెడుతున్నా..ప్రభుత్వం తీరు మాత్రం మారడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా కాగ్ బయటపెట్టిన అప్పుల నివేదికను చూస్తే రాష్ట్రం అప్పుల విషయంలో మరింత దిగజారిందని అంటున్నారు. ఇప్పటికైనా కేంద్రం ఈ విషయంలో ప్రత్యేకంగా చొరవ తీసుకోకపోతే రాను రాను ఏపీ పరిస్థితి మరీ అధ్వానంగా మారే ప్రమాదముందని అంటున్నారు.