వైసీపీలో ముఖ్య నేతల్లో నైరాశ్యం పెరుగుతోంది. పదవులపై ఆశలతో వచ్చిన వారికి నిరాశే ఎదురవుతోంది. వైఎస్ జగన్ సీఎం కావడానికి తమ శక్తియుక్తుల్ని ధారపోసి నిరంతరం శ్రమించిన నేతలకు కనీస స్థానం కూడా దక్కడం లేదని వాపోతున్నారు. మంత్రి పదవులపై ఆశలు పెంచుకున్నచిత్తూరు జిల్లా నేతల పరిస్థితి అధ్వానంగా మారింది. ఎదురుచూపులే తప్ప ఆశలు నెరవేరే దారులు కనిపించడం లేదు. ప్రతిపక్షంపై తమ మాటలతో కంగారెత్తించిన నేతలకు సముచిత స్థానం దక్కడం లేదు.
చిత్తూరులో చంద్రగిరి నుంచి వరుస విజయాలు సొంతం చేసుకున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, నగరి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రోజా, ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఉన్నారు. మంత్రిగా మాత్రం నారాయణ స్వామికే అవకాశం చిక్కింది. దీంతో అందరు రెడ్డి సామాజిక వర్గం కావడంతో నారాయణ స్వామిని పక్కన పెట్టలేక ఉన్న వారికి స్థానం ఇవ్వలేకపోవడంతో వారంతా అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం జగన్ ను కలవడానికి కూడా కనీసం అపాయింట్ మెంట్ కూడా దొరకని పరిస్థితి లేదు. అయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి జగన్ ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని తెలుస్తోంది. డిప్యూటీ సీఎంగా ఉన్న నారాయణ స్వామిని కూడా కాదని పెద్దిరెడ్డినే ఎక్కువగా నమ్ముతున్నారని ప్రచారం సాగుతోంది. దీంతో మిగిలిన నేతలందరు తమ అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీంతో మిగిలిన వారు అందరు కూడా తమకు పదవులు వస్తాయని ఆశిస్తున్నా అది నెరవేరేలా కనిపించడం లేదు.
జబర్దస్త్ ఫేమ్ రోజా మాత్రం ఇంతకాలం మంత్రి పదవి వస్తుందని ఆశలు పెంచుకున్నారు. కానీ ఇంతవరకు ఆమెకు కనుచూపు మేరలో పదవి వచ్చే సూచనలు కనిపించడం లేదు. అధికారంలోకి రావడానికి పరోక్షంగా కారణమైన ఆమెను మంత్రి పదవి మాత్రం ఊరిస్తూనే ఉంది. ఈసారైనా మంత్రి వర్గ విస్తరణలో తనకు అవకాశం దక్కుతుందో లేదో అని వేచి చూస్తున్నారు.