Sindh belongs to India: జనగణమన అధినాయక జయహే అంటూ నిత్యం జాతీయ గీతం పాడతాం. ఇందులో పంజాబ్ సిం«ద్, గుజరాత్, మరాఠా అని పలుకుతాం. కానీ ఇందులో సింధ్ మన దేశంలో లేదు. రవీంద్రనాథ్ ఠాకూర్ జాతీయ గీతం రాసిన సమయంలో భారత్‌లో అంతర్భాగంగా ఉన్న సింధ్.. ఇప్పుడు భౌగోళికంగా పాకిస్తాన్‌లో ఉంది. కానీ సాంస్కృతికంగా ఇప్పటికీ సింధ్ భారత్‌దే. ఇదే విషయాన్ని రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ ఇటీవల ఒక సింధ్ సాహిత్య సదస్సులో స్పష్టం చేశారు.
సాంస్కృతికంగా సింధ్ మనదే..
సింధ్ ప్రాంతం భౌగోళికంగా పాకిస్తాన్‌లో ఉండి వున్నప్పటికీ, జీవన విధానాలు, సాంస్కృతిక అనుబంధాలు భారత్‌తోనే ఉన్నాయని, అనేక మంది సింధ్ ప్రజలు భారతీయులుగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సింధ్‌ను భారత్‌లో కలుపకూడదా అన్న ఆలోచనలకు పునాదిగా రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యలు ఉన్నాయి.
సింధ్ చరిత్ర..
సింధ్ 1936లో బ్రిటిష్ భారతదేశం నుంచి వేరుగా బాంబే ప్రెసిడెన్సీ నుంచి విడదీయబడింది. 1947లో కేవలం ఓ ఓటుతో పాకిస్తాన్‌లో కలిసింది. అప్పటి అసెంబ్లీ స్పీకర్ జీఎం సయ్యిద్ తప్పు జరిగినట్లు అంగీకరించారు. ప్రస్తుతం సింధ్ ప్రజలు పాకిస్తాన్‌లో వేధింపులకు గురవుతున్, స్వాతంత్య్రం కోరుకుంటున్నారు.
11 ఏళ్లలోనే పాకిస్తాన్‌లో వలీనం..
1936లో భారత్ నుంచి విపోయిన సింధ్ 1947లో పాకిస్తాన్‌లో కలిసింది. కేవలం భారత్ నుంచి విడిపోయిన 11 ఏళ్లలోనే సిం«ద్ పాకిస్తాన్‌లో కలిసింది. ఇప్పుడు ఎందుకు కలిశామా అని దశాబ్దాలుగా బాధపడుతోంది. కేవలం ముస్లింల ఆధిపత్యం కారణంగానే సిం«ద్ పాకిస్తాన్‌లో కలిసింది. దీంతో సిం«ద్‌లోని హిందువులు భారత్‌కు వచ్చారు. అయినా అక్కడి వారు పాకిస్తాన్‌లో కలవడం తప్పు అని భావిస్తున్నారు.
పాకిస్తాన్ అంతర్గత విభేదాలు..
పాకిస్తాన్‌లో సింధ్‌తోపాటు బలూచిస్తాన్, ఖైబర్‌ఫఖ్తూన్ ప్రాంతాల్లో కూడా వేర్పాటు ఉద్యమాలు కొనసాగుతున్నాయి. పాకిస్తాన్ ప్రభుత్వ నియంత్రణ పూర్తిగా లేనిది, స్థానికులు వివక్షపై ఆందోళనలు చేస్తున్నారు. రాజనాథ్ సింగ్ సింధ్ పేరు ఎత్తడంతో పాకిస్తాన్ దీర్ఘకాల రాజకీయ, భౌగోళిక విలువలకు సవాల్ విసురుతున్నారని, సింధ్ భారతంతో కలిసే రోజులు దగ్గరగా ఉన్నాయని భావిస్తున్నారు. ఇది పాకిస్తాన్ వ్యతిరేక రాజకీయ వాతావరణాన్ని పెంపొందించడంతోపాటు భారత్ ఆర్థిక, సాంస్కృతిక తదితర దిశలో సింధ్ పునర్నిర్మాణానికి సందేశం.