Yellamma movie updates: సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా పట్టాలెక్కడమనేది అంతా ఆషామాషీ వ్యవహారం కాదు. కథ రెడీగా ఉన్నప్పటికి, ప్రొడ్యూసర్ సైతం డబ్బులు పట్టుకొని సిద్ధం గా ఉన్న కూడా కొన్ని కారణాల వల్ల సినిమా స్టార్ట్ అవ్వకపోవచ్చు. కారణం ఏంటంటే సినిమాను తన భుజాల మీద మోసే హీరో లేకపోవడం…దానివల్ల కూడా సినిమా చాలా రోజుల పాటు పోస్ట్ పోన్ అవుతుందనే విషయం చాలామందికి తెలియదు. ఇక 20 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న దిల్ రాజు సైతం ప్రస్తుతం వేణు ఎల్దండి దర్శకత్వంలో ‘ఎల్లమ్మ’ అనే సినిమాని అనౌన్స్ చేశాడు. ఇక ఈ సినిమాకి హీరో ఎవరు అనేది మొదటి నుంచి కన్ఫ్యూజన్స్ ఎదురవుతున్నాయి. ఇక మొదట నితిన్ తో ఈ సినిమా చేయాలని అనుకున్నారు. కానీ దిల్ రాజు బ్యానర్ లో వచ్చిన ‘తమ్ముడు’ సినిమా ఫ్లాప్ అవ్వడంతో నితిన్ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడు. అలాగే అతని తర్వాత మరికొంతమంది హీరోల పేర్లు కూడా వినిపించాయి. ఎప్పటికప్పుడు ఈ సినిమాలో హీరో గా ఆ నటుడు చేస్తున్నాడు అంటూ వార్తలు వచ్చినప్పటికి సినిమా యూనిట్ నుంచి మాత్రం ఇప్పటివరకు ఎలాంటి అఫిషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. ఇక ఇప్పటికే ఈ సినిమాలో హీరోయిన్ గా కీర్తి సురేష్ ని ఫిక్స్ చేశారు.
అలాగే సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొత్తం పూర్తయింది. లొకేషన్స్ ని కూడా ఫైనల్ చేశారు. కానీ హీరో దగ్గరే షూటింగ్ ఆగిపోతోంది. ఇక ఈ సినిమాలో హీరోగా దేవీ శ్రీ ప్రసాద్ నటిస్తున్నాడు అంటూ గతంలో కొన్ని వార్తలైతే వచ్చాయి. మరి ఈ వార్తల మీద కూడా ఎలాంటి స్పందనను తెలియజేయడం లేదు. దాంతో మన సినిమా మీద బయటి వాళ్ళు గాసిప్స్ రాయడం ఎందుకు మనమే సినిమాకు సంబంధించిన అప్డేట్ ని డిసెంబర్లో ఇస్తున్నామంటూ దిల్ రాజు కాంపౌండ్ నుంచి ఒక అనౌన్స్మెంట్ వచ్చింది.
ఇక డిసెంబర్లో ఈ సినిమాకు సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నారట. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో దేవి శ్రీ ప్రసాద్ హీరోగా చేస్తున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక దానికి తగ్గట్టుగానే ఈ సినిమాకి దేవి మ్యూజిక్ ని కూడా అందించబోతున్నాడనే వార్తలైతే వస్తున్నాయి.
ఇక ఏది ఏమైనా కూడా దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాతో ఎలాంటి గుర్తింపును సంపాదించుకుంటాడు. తద్వారా ఆయనకంటూ ఒక ఐడెంటిటి తెచ్చుకుంటాడా? హీరోగా తను మొదటి సినిమాతో సక్సెస్ ను సాధిస్తాడా? తనను తాను హీరోగా ఎలా నిలబెట్టుకుంటాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…