Health Tips: ఆరోగ్యంగా జీవించాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ కొంతమంది ఆహార నియమాలు పాటించకుండా ఇష్టం వచ్చినట్లు తింటూ ఉంటారు. ఇలా ఆహారం తినడం వల్ల అనవసరపు కొవ్వు శరీరంలో చేరి అనేక అనారోగ్యాలకు దారితీస్తుంది. వాస్తవమైన విషయం ఏందంటే ఆరోగ్యాన్ని ఇచ్చే పదార్థాల కంటే అనారోగ్యాన్ని తెచ్చే పదార్థాలకి ధర ఎక్కువ. అయినా కూడా వాటిని ఇష్టంగా తింటూ ఉంటారు. అయితే వీటి ప్లేసులో ఆరోగ్యకరమైన పదార్థాలు తీసుకోవడం వల్ల ఎలాంటి రోగాలు రాకుండా ఉంటాయి. మరి ఆ ఆరోగ్యకరమైన పదార్థాలు ఏవో ఇప్పుడు చూద్దాం..
రకరకాల ఒత్తిడి వలన చాలామంది తలనొప్పికి గురవుతూ ఉంటారు. ఇలాంటివారు వెంటనే టీ తాగాలని అనుకుంటూ ఉంటారు. కానీ టీ తాగడం వల్ల శరీరంలో ఉష్ణోగ్రత పెరగడంతో పాటు టిఫిన్ అనే పదార్థం మానసికంగా అనేక సమస్యలను తీసుకొస్తుంది. అందువల్ల ఇలా తలనొప్పి ఉన్నప్పుడు ఒక అరటిపండు తినడం వల్ల వెంటనే తగ్గిపోయే అవకాశం ఉంటుంది.
చాలామందికి ఆహారం తిన్న తర్వాత జీర్ణ సమస్యలు ఎదుర్కొంటారు. ఇలాంటి సమయంలో రకరకాల రసాయనాలు కలిగిన కూల్డ్రింక్స్ తీసుకుంటూ ఉంటారు. వీటికి బదులుగా ఒక యాపి తీసుకోవడం వల్ల వెంటనే జీర్ణ క్రియ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది..
వాటర్ ఇన్ఫెక్షన్ వల్ల ఒక్కోసారి గొంతు సమస్యలు ఏర్పడతాయి. గొంతు మండలం లేదా గొంతులో ఏదో ఉన్నట్లు అనిపించి ఇబ్బందిగా ఉంటుంది. ఇలాంటివారు ఒక చెంచా తేనె నీరు తాగడం వల్ల సమస్య పరిష్కారం అవుతుంది.
ఈరోజుల్లో ఆరోగ్యంలో భాగంగా జుట్టు కూడా అందంగా ఉండాలని చాలామంది కోరుకుంటూ ఉంటారు.. కానీ వాతావరణం కాలుష్యం వల్ల జుట్టు పొడి పారిపోతూ ఉంటుంది. అయితే ఇలా జుట్టు పొడిబారిన సమయంలో రసాయనాలు కలిగిన ఆయిల్ ను పెడుతూ ఉంటారు. వాటి ప్లేస్ లో సిమ్లా మిర్చిని ఎక్కువగా తినడం వల్ల జుట్టు పొడిబార కుండా ఉంటుంది.
ఏ పని చేసినా అలసట రావడం సహజం. ఇలా అలసట ఏర్పడినప్పుడు ఏవేవో ఆహార పదార్థాలు తింటూ ఉంటారు. కానీ ఎలాంటి ఆహార పదార్థాల జోలికి వెళ్లకుండా కేవలం ఆరెంజ్ తీసుకోవడం వల్ల వెంటనే ఉత్సాహంగా మారిపోతారు. ఆ తర్వాత చేసే పనులను వెంటనే పూర్తి చేయగలుగుతారు.
నేటి కాలంలో చాలామంది ఎదుర్కొంటున్న సమస్య నిద్రలేమి. ఇలా నిద్రలేమి ఉన్నవారు రోజుకు ఒక కివి ఫ్రూట్ తినడం వల్ల మానసికంగా ప్రశాంతంగా మారుతుంది. దీంతో వెంటనే నిద్ర వస్తుంది. ఒక్కోసారి ఆస్పత్రికి వెళ్ళినప్పుడు రక్తం తక్కువగా ఉంది అని వైద్యులు చెబుతూ ఉంటారు. ఇలాంటి సమయంలో డేట్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తం ఎక్కువగా తయారయ్యే అవకాశం ఉంటుంది.
ఆహారం తిన్న వెంటనే కడుపు ఉబ్బరంగా ఉండడం సహజం. ఇలాంటివారు ఒక కప్పులో పెరుగు వేసుకొని అందులో కాస్త చక్కెర కలుపుకొని తినడం వల్ల వెంటనే సమస్య పరిష్కారం అవుతుంది.