https://oktelugu.com/

teeth strong : దంతాలు స్ట్రాంగ్ గా ఉండాలంటే జస్ట్ ఈ ఫుడ్స్ చాలు..

శరీరంలోని అన్ని అవయవాల మాదిరి దంతాలు కూడా చాలా ముఖ్యం. వీటి వల్లే ప్రతి ఒక్క ఆహారం తినగలం.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : December 9, 2024 / 08:46 AM IST

    teeth strong

    Follow us on

    teeth strong : శరీరంలోని అన్ని అవయవాల మాదిరి దంతాలు కూడా చాలా ముఖ్యం. వీటి వల్లే ప్రతి ఒక్క ఆహారం తినగలం. దంతాలు ఆరోగ్యంగా ఉంటే మాత్రమే మీ పూర్తి ఆరోగ్యం మెరుగు అవుతుంది. వాటిని చాలా క్లీన్ గా ఉంచుకోవాలి. లేదంటే చాలా సమస్యలు వస్తాయి. పంటి నొప్పి, చిగురు సమస్యలు, నోటి పూత వంటి సమస్యలతో బాధ పడాల్సి వస్తుంది. అందుకే దంతాల ఆరోగ్యాన్ని నెగ్లెట్ చేయకుండా నోటిని ఆరోగ్యంగా ఉంచుకోవాలి అంటున్నారు డెంటిస్టులు. మరో ముఖ్యమైన విషయం నోటి ఆరోగ్యం ఎంత ముఖ్యమో.. వాటి కోసం తీసుకోవాల్సిన ఆహారం కూడా అంతే ముఖ్యం. దంతాలు, దంత క్షయం వంటి సమస్యలు రావద్దంటే కొన్ని ఆహారాలు తీసుకోవాలి. మరి అవేంటో చూసేయండి..

    దంత క్షయం దంతాల ఎనామెల్‌ను ప్రభావితం చేస్తుంది. దంతాల బయటి పూత, దంతాల డెంటిన్ పొర ను కాపాడుకోవాలి. దంతక్షయానికి ప్రధాన కారణాలలో పేలవమైన ఆహారం ఒకటి అంటున్నారు నిపుణులు. రొట్టెలు, తృణధాన్యాల వంటి పిండి పదార్ధాలు, సోడా, చాక్లెట్, కేకులు మొదలైన చక్కెర పదార్ధాలు దంతాలపై ఉండిపోతాయి. చివరికి దంత క్షయాన్ని కలిగిస్తాయి. దంతాల ఆరోగ్యానికి మీరు తినవలసిన ఆహారాల జాబితా గురించి తెలుసుకొని మీ డైట్ లో భాగం చేసుకోండి.

    డార్క్ చాక్లెట్ లు మీకు దంత క్షయం రాకుండా చూస్తాయి. డార్క్ చాక్లెట్‌లో CBH ఉంటుంది. ఇది దంతాల ఎనామెల్‌ను గట్టిపరచడంలో సహాయపడుతుంది. బాదం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. ఈ గింజలు ప్రోటీన్, కాల్షియంతో నిండి ఉంటాయి. మీరు వాటిని నమిలినప్పుడు ఫలకాన్ని తొలగించడంలో సహాయపడతాయి. వెల్లుల్లి కూడా ప్రతికూలంగా అనిపిస్తుంది. ఎందుకంటే వెల్లుల్లి నోటి దుర్వాసనకు దోహదం చేస్తుంది. కానీ వెల్లుల్లి నుంచి వచ్చే అల్లిసిన్ అనే సమ్మేళనం, దంత క్షయానికి కారణం అవుతుంది. కానీ బ్యాక్టీరియా నోటిలో పెరగకుండా చేస్తుంది ఈ వెల్లుల్లి.

    ఆకుకూరలు చాలా ప్రయోజనాలను అందిస్తాయి. ఇవి కాల్షియం, విటమిన్ ఎ, ఫోలిక్ యాసిడ్, విటమిన్ సితో నిండి ఉంటాయి. ఇవి దంతాలను ఆరోగ్యంగా ఉంచగలవు. అదనంగా ఇవి తక్కువ కేలరీలతో నిండి ఉంటాయి కాబట్టి మరో అదనపు బోనస్ అన్నమాట. చీజ్ చాలా మందికి ఇష్టమే. ఈ పాల ఉత్పత్తులు బలమైన ఎముకలను నిర్మించగలవు. జున్ను మినహాయింపు కాదండోయ్ గుర్తు పెట్టుకోండి. ఇక సాల్మన్ కూడా మీకు ప్రయోజనాలను అందిస్తుంది. ఇతర కొవ్వు చేపలు విటమిన్ డి, కాల్షియం, ఒమేగా-3 ఆమ్లాలను అందిస్తాయి. ఇవి చిగుళ్ల ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తాయి. పండ్లు, కూరగాయలును తీసుకోవడం మర్చిపోవద్దు. నోటిలోని బ్యాక్టీరియాను చంపడం, సహజ టూత్ బ్రష్‌గా పని చేయడం, విటమిన్లు అందించడం వంటి మరిన్ని ప్రయోజనాలను అందిస్తాయి. వీటి ద్వారా మీ నోటి ఆరోగ్యానికి చాలా జరుగుతుంది.