https://oktelugu.com/

పొలం దున్నుతుండగా బయటపడిన గుప్తనిధి

ఎంతోమంది గుప్తనిధుల ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరు గుప్తనిధులు దొరకగాపోగా ఆర్థికంగా నష్టపోయిన సంఘటనలు అనేకం కన్పిస్తుంటాయి. అయితే ఓ వ్యక్తి వ్యవసాయ పనుల కోసం తన పొలం దున్నుతుండగా గుప్తనిధి బయటపడింది. అందులో పురాతనకాలం నాటి వెండి నాణేలు ఉండటంతో సదరు పొలం యజమానితోపాటు కొంతమంది సడిచప్పుడు చేయకుండా ఇంటికి పట్టుకెళ్లారు. ఇంకేముందే ఈ విషయం ఆ నోటా.. ఈనోటా పాకి చివరికీ రెవెన్యూ అధికారులకు చేరింది. దీంతో అధికారులు ఈ వెండి నాణేలను స్వాధీనం […]

Written By:
  • Neelambaram
  • , Updated On : April 3, 2020 3:19 pm
    Follow us on


    ఎంతోమంది గుప్తనిధుల ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరు గుప్తనిధులు దొరకగాపోగా ఆర్థికంగా నష్టపోయిన సంఘటనలు అనేకం కన్పిస్తుంటాయి. అయితే ఓ వ్యక్తి వ్యవసాయ పనుల కోసం తన పొలం దున్నుతుండగా గుప్తనిధి బయటపడింది. అందులో పురాతనకాలం నాటి వెండి నాణేలు ఉండటంతో సదరు పొలం యజమానితోపాటు కొంతమంది సడిచప్పుడు చేయకుండా ఇంటికి పట్టుకెళ్లారు. ఇంకేముందే ఈ విషయం ఆ నోటా.. ఈనోటా పాకి చివరికీ రెవెన్యూ అధికారులకు చేరింది. దీంతో అధికారులు ఈ వెండి నాణేలను స్వాధీనం చేసుకొని వెళ్లిపోయారు.

    తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో ఈ సంఘటన ఆలస్యంగా చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఎల్మకన్నె గ్రామానికి చెందిన పీఏసీఎస్ డైరెక్టర్ వెంకట్రామిరెడ్డి సోమవారం ఉదయం తన పొలాన్ని దున్నేందుకు సిద్ధమయ్యాడు. ఈక్రమంలోనే అతడికి పొలంలో వెండినాణేలు బయటపడ్డాయి. దీనిని గమనించిన వెంకట్రామిరెడ్డి, తన పొలంలో పని చేస్తున్ కొందరు బయటపడిన నాణేలను గుట్టుగా పంచుకొని అక్కడి నుంచి కామ్ గా వెళ్లిపోయారు. అయితే విషయం ఆ నోటా.. ఈనోటాపడటంతో రెవిన్యూ, పోలీసు అధికారులు రంగంలోకి దిగారు.

    అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి గుప్తనిధి బయటపడినట్లు నిర్ధారించుకున్నారు. పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో నాణేలను పట్టుకెళ్లిన వాళ్లు అధికారులకు తిరిగిచ్చేశారు. వీరి నుంచి 141వెండి నాణేలను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. గుప్తనిధి బయటపడిన నాలుగైదు రోజులకుగానీ ఈ విషయంలో బయటికి పొక్కలేదు. చివరికీ ఈ విషయం అధికారులకు చేరడంతో గుప్తనిధి కథ కంచికి చేరింది. ఏదైనా అప్పనంగా వచ్చింది.. మనదగ్గర ఎక్కువ కాలం ఉండదని పెద్దలు చెప్పినమాట ఈ విషయం చూస్తే అర్థమవుతుంది.