KCR : కేసీఆర్ కు నచ్చితే అంతే భయ్.. ఇదిగో ఇలా ఉంటది

KCR : ‘తా వలచింది రంభ.. తా మునిగింది గంగ..’ సీఎం కేసీఆర్ కు అంత ఈజీగా ఎవరూ నచ్చరు. నచ్చారంటే వదిలిపెట్టరంతే.. భోళా శంకరుడి వలే తనను పొగిడిన తపస్సు చేసిన వారికి పెద్దపీట వేయడం పదవులు ఇవ్వడం తెలంగాణ సీఎంకు అలవాటు. అందుకే తన సొంత జిల్లాను అభివృద్ధి చేసి తాను చెప్పినట్టు బాగా పనిచేసిన సిద్దిపేట కలెక్టర్ కు ఇప్పుడు అందలం దక్కబోతోంది.కేసీఆర్ తలుచుకున్నాడు కాబట్టి ఇప్పుడు సిద్దిపేట కలెక్టర్ వెంకటరామిరెడ్డి కథ […]

Written By: NARESH, Updated On : November 15, 2021 3:23 pm
Follow us on

KCR : ‘తా వలచింది రంభ.. తా మునిగింది గంగ..’ సీఎం కేసీఆర్ కు అంత ఈజీగా ఎవరూ నచ్చరు. నచ్చారంటే వదిలిపెట్టరంతే.. భోళా శంకరుడి వలే తనను పొగిడిన తపస్సు చేసిన వారికి పెద్దపీట వేయడం పదవులు ఇవ్వడం తెలంగాణ సీఎంకు అలవాటు. అందుకే తన సొంత జిల్లాను అభివృద్ధి చేసి తాను చెప్పినట్టు బాగా పనిచేసిన సిద్దిపేట కలెక్టర్ కు ఇప్పుడు అందలం దక్కబోతోంది.కేసీఆర్ తలుచుకున్నాడు కాబట్టి ఇప్పుడు సిద్దిపేట కలెక్టర్ వెంకటరామిరెడ్డి కథ మారుతోంది.

KCR-Siddipet-collector

సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంకటరామిరెడ్డి తన ఐఏఎస్ పదవికి రాజీనామా చేయడం.. దాన్ని తెలంగాణ ప్రభుత్వం ఆమోదించడం జరిగిపోయింది. రాజీనామా ఆమోదం కాగానే.. ఇక తన జీవితం ప్రజా జీవితానికి అంకితం అని కలెక్టర్ వెంకటరామిరెడ్డి ప్రకటించారు. కేసీఆర్ మార్గదర్శకత్వంలో పనిచేస్తానన్నారు.

త్వరలోనే ఏపీ, తెలంగాణల్లో దాదాపు 12 చొప్పున ఎమ్మెల్సీ ఎన్నికలున్నాయి. 12 మందిలో ఒక సీటు సిద్దిపేట కలెక్టర్ కు ఖాయం అయ్యిందని.. ఆయనను కేసీఆర్ ఎమ్మెల్సీ చేయబోతున్నట్టు సమాచారం.

ఈ క్రమంలోనే తన కలెక్టర్ పదవికి వెంకటరామిరెడ్డి రాజీనామా చేసేశారు. ఇప్పుడు టీఆర్ఎస్ లో చేరి ఎమ్మెల్సీగా కానున్నారు. తెలంగాణలో ఐఏఎస్, ఐపీఎస్ లకు ఇప్పటికే పదవులతో పెద్దపీట వేశాడు కేసీఆర్. ఇప్పుడు అదే బాటలో వెంకటరామిరెడ్డి కూడా చేరబోతున్నాడు.