https://oktelugu.com/

RRR: ‘ఆర్​ఆర్​ఆర్’​ దెబ్బకు రేసులో నుంచి ‘గంగూబాయి’ ఔట్​!

RRR: రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్​, రామ్​చరణ్​ హీరోలుగా తెరకెక్కుతోన్న సినిమా ఆర్​ఆర్​ఆర్. పీరియాడికల్​ స్టోరీ నేపథ్యంలో రూపొందిస్తోన్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటి అలియా భట్​, హాలీవుడ్ హీరోయిన్​ ఓలీవియా మోరిస్​లు హీరోయిన్లుగా కనిపించనున్నారు. ఇక కీలక పాత్రలో అజయ్​దేవగణ్ కూడా నటిస్తున్నారు ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్లు, పాటలు సినిమాపై అంచనాలు రేకెత్తిస్తున్నాయి. కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా.. వచ్చే ఏడాది జనవరు 7న విడుదలకు సిద్ధమైంది. కాగా, అదే సమయానికి […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : November 15, 2021 / 03:34 PM IST
    Follow us on

    RRR: రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్​, రామ్​చరణ్​ హీరోలుగా తెరకెక్కుతోన్న సినిమా ఆర్​ఆర్​ఆర్. పీరియాడికల్​ స్టోరీ నేపథ్యంలో రూపొందిస్తోన్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటి అలియా భట్​, హాలీవుడ్ హీరోయిన్​ ఓలీవియా మోరిస్​లు హీరోయిన్లుగా కనిపించనున్నారు. ఇక కీలక పాత్రలో అజయ్​దేవగణ్ కూడా నటిస్తున్నారు ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్లు, పాటలు సినిమాపై అంచనాలు రేకెత్తిస్తున్నాయి. కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా.. వచ్చే ఏడాది జనవరు 7న విడుదలకు సిద్ధమైంది.

    కాగా, అదే సమయానికి సంజయ్​ లీలా భన్సాలీ తెరకెక్కిస్తోన్న గంగూబాయి కథియావాడి సినిమా కూడా థియేటర్లలోకి రానుంది. అజయ్‌ దేవ్‌గణ్‌, అలియా భట్‌ ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషిచంచారు. ఈ సినిమాను జనవరి 6న విడుదల చేయాలని ఇది వరకే నిర్ణయించింది చిత్రబృందం.  హీందీతో పాటు, తెలుగులోనూ ఈ సినిమా రిలీజ్​ చేయనున్న సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు ఆర్​ఆర్​ఆర్​ కూడా పోటీలో ఉండటంతో దర్శక నిర్మాతలు కన్​ఫ్యూజన్​లో పడ్డారు. ఈ రెండు సినిమాల మధ్య విడుదలకు ఒక రోజు గ్యాప్​ మాత్రమే ఉంది. ఇటువంటి సమయంలో విడుదల చేస్తే కలెక్షన్ల పరంగా తీవ్ర ప్రభావం పడుతుంది.

    అందుకే గంగూబాయి చిత్రబృందం కాస్త వెనక్కి తగ్గింది. జనవరి 7న కాకుండా.. ఫిబ్రవరి 18న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు చిత్రయూనిట్​ తెలిపింది. దీంతో ఆర్​ఆర్​ఆర్​కు బాలీవుడ్​లోనూ రూట్​ క్లియర్ అయినట్లైంది. వాస్తవ ఘటనల ఆధారంగా గంగూబాయ్ సినిమా తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే.