https://oktelugu.com/

కరోనా అంతానికి సరికొత్త డివైస్.. త్వరలో మార్కెట్లోకి

కరోనా వైరస్ కు చెక్ పెట్టేందుకు ఓ ప్రత్యేక డివైస్ తయారైంది. బెంగూళూరు చెందిన డి స్కెలీన్ అనే కంపెనీ కరోనా కానన్(షైకో క్యాన్)ను ఆవిష్కరించింది. ఈ పరికరం ద్వారా కరోనా వైరస్ 99.9శాతం గాలిల్లోనే పూర్తిగా నాశనం అవుతుందట. ఈ పరికరం తయారు చేసేందుకు పారిశ్రామికంగా అనుమతి లభించింది. దీంతో త్వరలోనే ఈ డివైజ్ మార్కెట్లోకి రానుంది. కాగా ఇప్పటికే డివైస్ ను వాడుకునేందుకు అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్టేషన్ (ఎఫ్‌డీఏ), యురోపియ‌న్ యూనియ‌న్ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 28, 2020 / 07:26 PM IST
    Follow us on


    కరోనా వైరస్ కు చెక్ పెట్టేందుకు ఓ ప్రత్యేక డివైస్ తయారైంది. బెంగూళూరు చెందిన డి స్కెలీన్ అనే కంపెనీ కరోనా కానన్(షైకో క్యాన్)ను ఆవిష్కరించింది. ఈ పరికరం ద్వారా కరోనా వైరస్ 99.9శాతం గాలిల్లోనే పూర్తిగా నాశనం అవుతుందట. ఈ పరికరం తయారు చేసేందుకు పారిశ్రామికంగా అనుమతి లభించింది. దీంతో త్వరలోనే ఈ డివైజ్ మార్కెట్లోకి రానుంది. కాగా ఇప్పటికే డివైస్ ను వాడుకునేందుకు అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్టేషన్ (ఎఫ్‌డీఏ), యురోపియ‌న్ యూనియ‌న్ (ఈయూ)లు అనుమ‌తి ఇవ్వడం గమనార్హం.

    బీజేపీ ఆపరేషన్ సక్సెస్ అయితే వైసీపీ, టీడీపీకి చిత్తడే..!

    ఈ డివైస్ ను అన్ని ప్రదేశాల్లో వాడేలా రూపొందించడం దీని ప్రత్యేకత. షైకోక్యాన్ డివైస్ చిన్న డ్ర‌మ్‌ను పోలినట్లు ఉంటుంది. ఈ పరికరాన్ని ఆఫీసులు, పాఠశాలలు, అన్ని విద్యాసంస్థలు, మాల్స్‌, హోట‌ళ్లు, ఎయిర్‌పోర్టులు, బస్ స్టేషన్, రైల్వే స్టేషన్లు త‌దిత‌ర ప్రాంతాల్లో ఎక్క‌డైనా ఉపయోగించుకునేలా రూపొందించారు. ఈ డివైస్ ఆ ప్రదేశాన్ని మొత్తం శానిటైజ్ చేస్తుంది. ఆ ప్రాంతంలోని గాలిలో ఉండే క‌రోనా వైర‌స్ ను 99.9 శాతం వ‌ర‌కు ఇది నశింపజేస్తుంది.

    ఈ డివైస్ లోని ఎలక్ట్రాన్లు క‌రోనా వైర‌స్‌లోని స్పైక్ ప్రొటీన్‌ను నాశ‌నం చేస్తుంది. ఇది ఆ ప్రాంతమంతటిని శానిటైజర్ చేస్తుంది. దీంతో ఆయా ప్ర‌దేశాల్లో ఎవ‌రు తిరిగినా వారికి క‌రోనా వ్యాపించ‌దని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. క‌రోనా ఉన్న‌వారు ద‌గ్గినా, తుమ్మినా వారి నుంచి వెలువ‌డే వైర‌స్ క‌ణాల‌ను ఈ డివైస్ నాశ‌నం చేస్తుందని చెబుతున్నారు. పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్న వేళ ఈ పరికరం ఎంతోగానే ఉపయోగ పడుతుందని చెబుతున్నారు.

    Also Read: కేసీఆర్ కూతురును వెంటాడుతున్న దురదృష్టం?

    సాధారణ పరిస్థితుల్లో ఇలాంటి పరికరాలు మార్కెట్లోకి రావడానికి 26రకాల టెస్టులు నిర్వహించాల్సి ఉంటుంది. ఈ డివైస్ వల్ల మనిషి ఆరోగ్యానికి హాని ఏమైనా క‌లుగుతుందా? ఇతర పరికరాలకు ఏమైనా? ఇబ్బందులు ఉన్నాయా? అని టెస్టులు చేసి ఆయా సంస్థ‌లు అనుమ‌తులు ఇస్తాయి. కానీ కరోనా విపత్కర పరిస్థితుల నేపథ్యంలో ఈ పరికరానికి అత్య‌వ‌స‌ర సేవ‌ల కింద ఎఫ్‌డీఏ, ఈయూలు ఇప్పటికే అనుమ‌తుల ఇచ్చాయి. దీంతో త్వ‌ర‌లోనే ఈ డివైస్ ను పారిశ్రామికంగా ఉత్ప‌త్తిచేసి స‌ర‌ఫ‌రా చేయ‌నున్నారు. అయితే ప‌రిక‌రం ధ‌ర ఎంతనేది మాత్రం అధికారికంగా వెల్లడికాలేదు.

    Tags